RRR : ఇండియా గురించి అమెరికన్స్‌కి.. ఆర్ఆర్ఆర్ మూవీ తెలియజేసింది.. అమెరికా అధికారి

అమెరికన్ అంబాసడర్ 'ఎరిక్ గర్చేట్టి' ఆర్ఆర్ఆర్ గురించిన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇండియా అంటే RRR అని..

RRR : ఇండియా గురించి అమెరికన్స్‌కి.. ఆర్ఆర్ఆర్ మూవీ తెలియజేసింది.. అమెరికా అధికారి

US Ambassador Eric Garcetti about Rajamouli RRR and India

Updated On : October 22, 2023 / 5:10 PM IST

RRR : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాటు నాటు సాంగ్ తో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించిది. రిలీజ్ అయ్యి ఏళ్ళు గడుస్తున్నా.. ఇంకా ఈ సినిమా గురించిన మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాని అమెరికా, జపాన్ వంటి దేశాలు చాలా ఓన్ చేసుకున్నాయి. దీంతో అక్కడ ఇండియా అంటే ముందుగా RRR గురించే మాట్లాడుతున్నారు. తాజాగా ఒక అమెరికన్ అంబాసడర్ ఆర్ఆర్ఆర్ గురించిన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

‘ఎరిక్ గర్చేట్టి’ అనే అమెరికా అధికారి ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ.. ఇండియా అంటే RRR అని చెప్పుకొచ్చాడు. అమెరికాపై ఇండియన్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందని, వారికీ అమెరికా గురించి చాలా బాగా తెలుసని ఆయన పేర్కొన్నాడు. కానీ అమెరికన్స్ కి ఇండియా గురించి పెద్దగా తెలియదని ఆయన చెప్పుకొచ్చాడు. అక్కడి సాంప్రదాయాలు వాళ్లకి పెద్దగా తెలియదు. RRR సినిమా అక్కడి కల్చర్, మ్యూజిక్ గురించి అమెరికన్స్ తెలియజేసింది. ఈ విషయాలు అమెరికన్స్ బాగా ఉత్తేజితం చేశాయి. దీంతో ఇండియన్ కల్చర్ పై మరింత ఆసక్తిని కలుగజేసింది అని ఆయన చెప్పుకొచ్చాడు.

Also read : Leo Movie Collections : లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇందుకు సంబంధించిన పోస్టు చూసిన టాలీవుడ్ ఆడియన్స్.. రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. జక్కన్నకి థాంక్యూ చెబుతున్నారు. బాహుబలి, RRR సినిమాలతో ఇండియాకి ఇంతటి గుర్తింపుని తీసుకు వచ్చిన రాజమౌళి.. తరువాత మహేష్ బాబుతో తీయబోయే SSMB29 తో ఇంకెంతటి పేరుని తీసుకు వస్తాడో చూడాలి. ఈ సినిమా కోసం ఇండియన్ ఆడియన్స్ తో పాటు హాలీవుడ్ లో కూడా ఆసక్తి చూపిస్తున్నారు.