Family Star Trailer : ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది.. నేను అలాంటి మగాడిని కాదండి బాబు..

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది.

Vijay Deverakonda Mrunal Thakur Family Star Trailer released

Family Star Trailer : ‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరుశురామ్ కలిసి చేస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లింప్స్ అండ్ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా మంచి బజ్ నే క్రియేట్ చేసుకుంది. తాజాగా ఇప్పుడు ట్రైలర్ ని తీసుకు వచ్చారు.

ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. మధ్యతరగతికి చెందిన హీరో.. తన ఫ్యామిలీ ఎమోషన్స్‌ని, బాధ్యతలను, అలాగే ప్రేమను ఎలా హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకు వెళ్ళాడు అనే విషయాలను పరుశురాం మార్క్ ఎంటర్టైనింగా చూపించబోతున్నారని తెలుస్తుంది. అలాగే గీతగోవిందంతో పోలిస్తే.. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండేలా కనిపిస్తుంది.

Also read : Siddharth – Aditi Rao Hydari : సినిమా షూటింగ్ అని చెప్పి.. పెళ్లి చేసుకున్నారు.. సిద్ధార్థ్, అతిథి పెళ్లి ఎలా జరిగిందంటే..?

కాగా ఈ మూవీలో ఠాకూర్ హీరోయిన్ తో పాటు అమెరికన్ యాక్ట్రెస్ ‘మరిస్సా రోజ్ గార్డన్’, మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌశిక్’, రష్మిక మందన్న కూడా కనిపించబోతున్నారట. అలాగే అభినయ, వాసుకి సిస్టర్ అండ్ వదిన పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. గోపిసుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వచ్చే వారం ఏప్రిల్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.