Vijay Deverakonda Nagarjuna movies Family Star Naa Saami Ranga Pongal 2024
Sankranti 2024 Releasing Movies : తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి వచ్చేందుకు టాలీవుడ్ మేకర్స్ అంతా ఉత్సాహం చూపిస్తుంటారు. ఈక్రమంలోనే పొంగల్ బరిలో మేము ఉండబోతున్నాము అంటూ పలువురు ప్రకటిస్తూ వస్తుంటారు. కానీ చివరికి వచ్చేసరికి.. అలా అనౌన్స్ చేసిన అన్ని సినిమాలు పండుగ రేసులో ఉండవు. ఇప్పుడు ఈ సంక్రాంతి రేసులో కూడా ఇదే జరుగుతుందని తెలుస్తుంది.
ఈసారి పొంగల్ రేసులో అరడజను తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలు పోటీకి దిగుతున్నాను అంటూ ప్రకటించాయి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హనుమాన్’, వెంకటేష్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామిరంగ’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, రజినీకాంత్ ‘లాల్ సలామ్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలు సంక్రాంతి వస్తున్నాయంటూ ప్రకటించాయి. అయితే వీటిలో గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, హనుమాన్ సినిమాలు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి బెర్త్ కన్ఫార్మ్ చేశాయి.
Also read : Nani : నాటు నాటు పాటకి నాని కొడుకు వేసిన స్టెప్పులు చూడండి.. క్యూట్ ఉంది..
నాగార్జున, విజయ్ దేవరకొండ, రజిని, ధనుష్ సినిమాలు మాత్రం డేట్ ఫిక్స్ చేయకుండా పండుగకి వస్తున్నామంటూ అనౌన్స్ చేశారు. ఇప్పుడు వీరిలో విజయ్ వెనక్కి తగ్గారని టాక్ వినిపిస్తుంది. ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి రేసు నుంచి ఆల్మోస్ట్ తప్పుకుందని సమాచారం. ఈ వార్త విజయ్ ఫ్యాన్స్ ని కొంచెం నిరాశకు గురి చేస్తుంది. ఇక ఆ రేసులో డేట్ ఫిక్స్ చేసుకోకుండా ఉన్న మరో తెలుగు సినిమా అంటే.. నా సామిరంగ.
మరి నాగార్జున కూడా ఈ రేసు నుంచి తప్పుకుంటారా..? లేదా..? అనేది చూడాలి. ఇక తమిళ్ హీరో సినిమాలు గురించి వారే చెప్పాలి. ఒకవేళ సంక్రాంతికి రావడం కష్టమైతే.. ముందుగా తమిళంలో రిలీజ్ అయ్యి తరువాత ఒక వారం అటు ఇటుగా తెలుగులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.