Nani : నాటు నాటు పాటకి నాని కొడుకు వేసిన స్టెప్పులు చూడండి.. క్యూట్ ఉంది..

నాటు నాటు పాటకి నాని కొడుకు అర్జున్ వేసిన స్టెప్పులు చూసారా..? బలే క్యూట్ ఉంది.

Nani : నాటు నాటు పాటకి నాని కొడుకు వేసిన స్టెప్పులు చూడండి.. క్యూట్ ఉంది..

Hi Nanna star Nani son Arjun steps for Naatu Naatu song

Updated On : November 14, 2023 / 4:55 PM IST

Nani : నేచురల్ స్టార్ నాని సినిమాల్లో పక్కింటి కుర్రాడిలా అల్లరి చేస్తూ ఎలా కనిపిస్తారో.. రియల్ లైఫ్ లో కూడా అలాగే అల్లరి చేస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా ఆయన కొడుకు అర్జున్ తో కలిసి మరింత అల్లరి చేస్తుంటారు. కొడుకుతో కలిసి నాని కూడా ఒక చిన్న పిల్లాడిలా మారిపోతుంటారు. అర్జున్ తో ఉన్న వీడియోలు, ఫోటోలు నాని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంటారు.

తాజాగా నేడు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే కావడంతో నాని తన కొడుకుతో ఉన్న కొన్ని వీడియోలను షేర్ చేశారు.. ఆ వీడియోలో నాని చంటి పిల్లాడిలా ఉయ్యాలా ఊగుతూ, అర్జున్ తో కలిసి మంచు కొండల్లో స్లైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. అలాగే నాని, అర్జున్ కలిసి నాటు నాటు పాటకి డాన్స్ వేస్తూ కనిపించారు. పాటని కూడా అర్జున్ హమ్ చేస్తూ కనిపించాడు. ఈ క్యూట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.

Also read : Aishwarya Rai : పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. భార‌తీయ న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్‌ను పెళ్లి చేసుకుని ఉంటే..?

కాగా నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ తో వస్తున్న ఈ మూవీలో హీరోయిన్ లవ్ ఎమోషన్ కూడా ఉండబోతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు శౌర్యువ్‌ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి సాంగ్స్ అండ్ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

డిసెంబర్ 7న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈక్రమంలోనే సాంగ్స్ ని తెలుగుతో పాటు ఆయా భాషల్లో కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. కాగా నాని గతంలో ‘జెర్సీ’ సినిమాని ఫాదర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది మంచి విజయం అందుకున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.