Vijay Deverakonda – Rashmika : రష్మిక అరుదైన గౌరవం.. గర్వంతో విజయ్ దేవరకొండ పోస్ట్..

రష్మిక అరుదైన గౌరవం దక్కడం పట్ల తనకి ఎంతో గర్వంగా ఉందంటున్న విజయ్ దేవరకొండ.

Vijay Deverakonda – Rashmika : రష్మిక అరుదైన గౌరవం.. గర్వంతో విజయ్ దేవరకొండ పోస్ట్..

Vijay Deverakonda post on Rashmika Mandanna Forbes India cover pic

Updated On : February 16, 2024 / 11:14 AM IST

Vijay Deverakonda – Rashmika : టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తమ పై వచ్చే రూమర్స్ ని పట్టించుకోకుండా, తమకి నచ్చినట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అలా కెరీర్ లో మంచి సక్సెస్‌లని అందుకుంటూ అరుదైన గౌరవాలు అందుకుంటున్నారు. తాజాగా రష్మిక.. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ ఇండియా వెర్షన్ కవర్ పేజీ పై స్థానం దక్కించుకున్నారు.

ప్రస్తుతం ఇండియాలో టాప్ పొజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారాలు, ఆవిష్కర్తలు, స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ఓ ప్రత్యేక ఆర్టికల్ ని ప్రచురించింది. ఈ ఆర్టికల్ లో సినిమా ఇండస్ట్రీ నుంచి రష్మిక స్థానం దక్కించుకున్నారు. ఈ ఆర్టికల్ కి సంబంధించిన కవర్ పేజీని రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి తన సంతోషాన్ని తెలియజేసారు. ఇక ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరు రష్మికకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Also read : Kalki 2898 AD : కల్కి సెట్స్ నుంచి వీడియో లీక్.. నెట్టింట ఫోటోలు వైరల్..

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా విషెస్ తెలియజేస్తూ పోస్టు వేశారు. రష్మిక పోస్టుని షేర్ చేస్తూ తన ఇన్‌స్టా స్టోరీలో విజయ్ ఇలా రాసుకొచ్చారు.. “నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎక్కడి నుంచో ఇక్కడి వరకు చేరుకున్నావు. ఇలాగే మరింత స్థాయికి ఎదగాలని, అందరికి స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను” అంటూ విజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. విజయ్ అండ్ రష్మిక ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు.

Vijay Deverakonda post on Rashmika Mandanna Forbes India cover pic

కాగా అభిమానులంతా వీరిద్దరి కలయికలో మరో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఆకట్టుకున్న ఈ జంటని.. మళ్ళీ ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో చూడాలని అనుకుంటున్నారు. మరి ఆ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ ప్రాజెక్ట్స్ తో కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.