×
Ad

Vijay Deverakonda : రజిని జైలర్ హిట్ అయ్యి.. భోళాశంకర్ ప్లాప్ అయితే.. చిరంజీవి స్థాయి తగ్గిపోదు..

రజినీకాంత్ జైలర్ హిట్, చిరంజీవి భోళాశంకర్ ప్లాప్ అంటూ మాట్లాడిన తమిళ్ మీడియా రిపోర్టర్స్ కి విజయ్ దేవరకొండ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

  • Published On : August 22, 2023 / 05:01 PM IST

Vijay Deverakonda reaction on Rajinikanth Jailer Chiranjeevi Bholaa Shankar conflict

Vijay Deverakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి (Kushi) మూవీ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈక్రమంలోనే తమిళనాడులో కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడి విలేకరులతో సమావేశం అయ్యాడు. ఇక ఈ మీడియా ఇంటరాక్షన్ లో తమిళ్ మీడియా ప్రతినిధులు.. రజినీకాంత్ (Rajinikanth) జైలర్ (Jailer) హిట్ అండ్ చిరంజీవి (Chiranjeevi) భోళాశంకర్ ప్లాప్ గురించి ప్రశ్నించారు. దీనికి విజయ్ తమిళ్ మీడియాకి గట్టి సమాధానం ఇచ్చాడు.

Prakash Raj : చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ వైరల్ ట్వీట్.. పోలీస్ కేసు నమోదు..

జైలర్ హిట్ కంటే ముందు రజినీకాంత్ కి చాలా ప్లాప్ లు ఉన్నాయని గుర్తు చేసిన విజయ్.. ఈ ఏడాది మొదటిలో వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లు తెలియజేశాడు. ఇప్పుడు ఒక సినిమా ప్లాప్ అయ్యినంత మాత్రం చిరు స్థాయి తగ్గదని పేర్కొన్నాడు. చిరంజీవి వచ్చిన తరువాత తెలుగు సినిమా తీసే పద్ధతి మారిందని, డాన్స్‌లు నుంచి ఫైట్స్ వరకు ప్రతి దానిలో చిరు ఒక ట్రెండ్ చేశాడని తెలియజేశాడు. ‘విక్రమ్’తో మొన్న కమల్, ‘జైలర్’తో నేడు రజిని కమ్‌బ్యాక్ ఇచ్చినట్లే చిరంజీవి కూడా ఇస్తాడని వెల్లడించాడు.

Renu Desai : ఒక్క రోజులోనే పవన్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన రేణూదేశాయ్.. అకీరా హీరో ఎంట్రీ లేనట్లేనా..?

చిరు, రజిని, కమల్.. వంటి సీనియర్ యాక్టర్స్ ఒక స్టాండర్డ్స్ సెట్ చేసి లెజెండ్స్ గా నిలిచారు. ఒక్క మూవీ రిజల్ట్ చూసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం సరికాదని పేర్కొన్నాడు. ఇక విజయ్ కామెంట్స్ కి మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ఫిదా అయ్యిపోయారు. తమిళ్ మీడియాకి విజయ్ బలే కౌంటర్ ఇచ్చాడంటూ మెచ్చుకుంటున్నారు. ఇక విజయ్ ఖుషి విషయానికి వస్తే.. సెప్టెంబర్ 1న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. సమంత (Samantha) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.