ఫేక్ సైట్లపై నాగ్ ‘యాక్షన్ ప్లాన్’.. సర్వత్రా ఆసక్తి..

విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపిన నాగార్జున..

  • Published By: sekhar ,Published On : May 5, 2020 / 03:00 PM IST
ఫేక్ సైట్లపై నాగ్ ‘యాక్షన్ ప్లాన్’.. సర్వత్రా ఆసక్తి..

Updated On : May 5, 2020 / 3:00 PM IST

విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపిన నాగార్జున..

కొన్ని వెబ్‌సైట్లకు చెందిన వ్యక్తులు తనపై కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పిన విజయ్.. కరోనా సంక్షోభంలో తను చేస్తున్న సేవలపై ఆ వెబ్‌సైట్లు ప్రచురించిన తప్పుడు కథనాలపై ఫైర్ అయ్యాడు. ఇటువంటి ఫేస్‌న్యూస్‌ల వల్ల తను మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు అందరూ బాధపడుతున్నారని అతను పేర్కొన్న నేపథ్యంలో పలువురు నటీనటులు, దర్శకులు విజయ్‌కి మద్దతు తెలుపారు. చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, అల్లరి నరేష్, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, క్రిష్ జాగర్లమూడి, మధుర శ్రీధర్, రానా దగ్గుబాటి, బీవీఎస్ రవి, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్ వంటి వారందరూ సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా కింగ్ నాగార్జున కూడా విజయ్‌కు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. చిరు ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ నాగార్జున, ‘మద్దతు ప్రకటించడం కంటే ఇప్పుడు కావాల్సింది సమస్య పరిష్కారానికి తగిన యాక్షన్ ప్లాన్’ అని స్పష్టం చేశారు. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘యాక్షన్ ప్లాన్ అనే మాట వింటుంటేనే ఉత్సాహం కలుగుతోంది, మీరు కూడా రంగంలోకి దిగి సమస్య తీవ్రతను మరింత స్పష్టంగా వినిపిస్తున్నందుకు థాంక్యూ నాగ్ సర్’ అంటూ రిప్లై ఇచ్చాడు. నాగ్ సంబోధించిన ‘యాక్షన్ ప్లాన్’ అనే మాట ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.