Vijay Deverakonda VD14 Movie First Look Poster Released
Vijay Deverakonda : చిన్న గ్యాప్ తీసుకొని విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాడు. విజయ్ కింగ్డమ్ సినిమా మే 30న రిలీజ్ కానుంది. ఆ తర్వాత మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో VD14 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
గతంలో విజయ్ దేవరకొండతో ట్యాక్సీవాలా సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా VD14 వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతుంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని, 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని గతంలో ఓ పోస్టర్ రిలీజ్ చేసారు.
Also Read : NTR : ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాకు బ్రేక్..
నేడు విజయ్ పుట్టిన రోజు కావడంతో VD14 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్ లో విజయ్ ఫేస్ చూపించలేదు. ఓ దేవుడి విగ్రహం ముందు విజయ్ ధ్యానం చేస్తున్నట్టు ఉంది. పేస్ చూపించకుండా కేవలం వీపు భాగం చూపించారు. ఈ పోస్టర్ లో విజయ్ అదిరిపోయే బాడీతో కనిపించాడు. దీంతో ఈ పోస్టర్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ రాజుల కాలంలో యోధుడిగా పీరియాడిక్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
The GODS gave him STRENGTH. War gave him a PURPOSE 🔥
Team #VD14 wishes @TheDeverakonda a very Happy Birthday ❤️🔥@Rahul_Sankrityn @MythriOfficial #BhushanKumar #KrishanKumar @TSeries @ShivChanana @neerajkalyan_24 pic.twitter.com/h3pjNceT8c
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2025