Sree Vishnu – Narne Nithiin : శ్రీవిష్ణు కోసం ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే..
తాజాగా శ్రీవిష్ణు సినిమాలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడట.

Narne Nithiin gives Guest Appearance in Sree Vishnu single Movie
Sree Vishnu – Narne Nithiin : ఒక హీరో సినిమాలో ఇంకో హీరో లేదా పేరున్న నటీనటులు గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తారని తెలిసిందే. దాంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు కూడా ఖుషి అవుతారు. అయితే తాజాగా శ్రీవిష్ణు సినిమాలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడట.
గత కొన్ని సినిమాలుగా ఫుల్ గా నవ్విస్తూ హిట్స్ కొడుతున్న శ్రీవిష్ణు తాజాగా మరో కొత్త సినిమాతో వచ్చాడు. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సింగిల్ సినిమా నేడు మే 9న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాతో కూడా శ్రీవిష్ణు ఫుల్ గా నవ్వించాడట. అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో పలు గెస్ట్ అప్పీరెన్స్ లు ఉన్నాయట. అందులో ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ కూడా ఉన్నాడట.
Also Read : Single : ‘#సింగిల్’ మూవీ రివ్యూ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పడీ పడీ నవ్వాల్సిందే..
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ సినిమాలతో హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు శ్రీవిష్ణు సినిమాలో ఓ చిన్న పాత్రలో వచ్చి మెరిపించాడు. నార్నె నితిన్ గీత ఆర్ట్స్ లో ఆయ్ సినిమా చేసాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. నిర్మాణ సంస్థతో ఉన్న అనుబంధంతోనే నితిన్ ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో అలరించాడు అని సమాచారం. దీంతో నితిన్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఇంకో ఇద్దరు హీరోయిన్స్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చారని తెలుస్తుంది.
Also Read : Subham : ‘శుభం’ మూవీ రివ్యూ.. సమంత నిర్మాతగా మొదటి సినిమా ఎలా ఉంది?