Single : ‘#సింగిల్’ మూవీ రివ్యూ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పడీ పడీ నవ్వాల్సిందే..

'#సింగిల్' సినిమా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఫుల్ కామెడీతో తెరకెక్కించారు.

Single : ‘#సింగిల్’ మూవీ రివ్యూ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పడీ పడీ నవ్వాల్సిందే..

Sree Vishnu Ketika Sharma Ivana Vennela Kishore Single Movie Review and Rating

Updated On : May 9, 2025 / 12:03 PM IST

#Single Movie Review : శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘#సింగిల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. #సింగిల్ సినిమా నేడు మే 9న థియేటర్లలో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. విజయ్(శ్రీవిష్ణు) ఒక బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటాడు. అతని లైఫ్ లో అమ్మాయి లేదని, సింగిల్ అని బాధపడుతూ ఉంటాడు. అలాంటి టైంలో అతని ఫ్రెండ్ అరవింద్(వెన్నెల కిషోర్)కి కూడా లవర్ ఉందని తెలిసి ఇంకా బాధపడతాడు. అదే సమయంలో పూర్వ(కేతిక శర్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెని ప్రేమలో పడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు విజయ్. ఈ క్రమంలో ఆమె పనిచేసే కార్ షోరూంకి వెళ్లి కార్ కొంటాను అని అబద్దాలు ఆడతాడు. మరోవైపు హరిణి(ఇవానా) విజయ్ తో పాలసీ చేయించుకుంటాను అని విజయ్ కి దగ్గరవడానికి ట్రై చేస్తూ ఉంటుంది.

విజయ్ కార్ కొంటాను అని చెప్పి మోసం చేసాడని, అదంతా ప్రేమ కోసం నాటకం అని పూర్వకి తెలియడంతో విజయ్ ని ఛీ కొట్టి వెళ్ళిపోతుంది. అదే సమయంలో హరిణి పాలసీ అని మోసం చేసిందని తెలియడంతో విజయ్ హరిణిని కోప్పడి వెళ్ళిపోతాడు. మరి విజయ్ – పూర్వల ప్రేమ సక్సెస్ అయిందా? హరిణి – విజయ్ ల లవ్ సక్సెస్ అయిందా? అసలు హరిణి ఎవరు? పూర్వకు ఉన్న సమస్యలు ఏంటి? విజయ్ చివరకు ఎవరితో ఉంటాడు? లేదా మళ్ళీ సింగిల్ గానే ఉంటాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Subham : ‘శుభం’ మూవీ రివ్యూ.. సమంత నిర్మాతగా మొదటి సినిమా ఎలా ఉంది?

సినిమా విశ్లేషణ.. శ్రీవిష్ణు గత కొన్ని సినిమాల నుంచి కామెడీని ప్రధానంగా చేసుకొనే కథలు చెప్తున్నాడు. ఏ కథ అయినా నవ్వించాలి, యూత్ కి బాగా కనెక్ట్ అవ్వాలి అనే పాయింట్ లోనే సినిమాలు తీస్తున్నాడు. ఈ సింగిల్ సినిమా కూడా అలాగే తీసాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినా నవ్వించడమే ప్రధానంగా పెట్టుకున్నారు.

ఫస్ట్ పార్ట్ అంతా విజయ్ పూర్వ వెనక పడటం, హరిణి విజయ్ వెనక పడటం, విజయ్ – అరవింద్ కామెడీతో సాగిపోతుంది. ఇంటర్వెల్ కి ఆసక్తికర ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో పూర్వ గురించి, హరిణి గురించి వాళ్ళ కథలు చూపించడం, విజయ్ ఎవరితో ఉంటాడు అని కాస్త ఎమోషనల్ గా ఎంటర్టైనింగ్ గా చూపించారు.

లాస్ట్ అరగంట మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఫుల్ గా నవ్విస్తారు. క్లైమాక్స్ కూడా కొత్తగా బాగుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే గెస్ట్ అప్పీరెన్స్ లు బాగుంటాయి. శ్రీవిష్ణు సినిమాలకు తగ్గట్టే ప్రస్తుత జనరేషన్ సోషల్ మీడియా ట్రెండింగ్స్ అన్ని డైలాగ్స్ లో వాడి బాగానే నవ్వించారు. మొత్తంగా ఓ సింపుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథని ఫుల్ గా నవ్విస్తూ చెప్పారు. ఫ్యామిలీతో, లవర్స్ తో అయినా, ఫ్రెండ్స్ తో అయినా కలిసి హ్యాపీగా థియేటర్ కి వెళ్లి సింగిల్ చూసి నవ్వుకోవచ్చు.

Single Movie

నటీనటుల పర్ఫార్మెన్స్.. శ్రీవిష్ణు ఎప్పట్లాగే తన కామిక్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో నవ్విస్తాడు. వెన్నెల కిషోర్ సినిమా అంతా ఫుల్ గా నవ్విస్తాడు. పూర్వ పాత్రలో కేతిక శర్మ ఓకే అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం మెప్పిస్తుంది. లవ్ టుడే ఫేమ్ ఇవానాకు ఇది తెలుగులో మొదటి సినిమా. తన యాక్టివ్ నెస్ పాత్రతో ఫుల్ గా నవ్విస్తూనే యాక్టింగ్ తో కూడా అదరగొట్టింది ఇవానా. రాజేంద్ర ప్రసాద్ ఓ చిన్న పాత్రలో కనిపించి మంచి ఎమోషన్ పండించారు. తమిళ్ కమెడియన్ విటివి గణేష్ కూడా బాగానే నవ్వించారు. సినిమాలో కొన్ని గెస్ట్ పాత్రలు అలరిస్తాయి. ప్రభాస్ శ్రీను, కిరాక్ సీత.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Operation Sindoor : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సినిమా టైటిల్ కోసం పోటీ పడుతున్న నిర్మాణ సంస్థలు..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. కామెడీ పంచెస్ పర్ఫెక్ట్ ఎలివేట్ అయ్యాయి. సింపుల్ పాత కథే అయినా స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా రాసుకున్నారు. ఇద్దరు హీరోయిన్స్ – హీరో మధ్యలో సీన్స్, సెకండ్ హాఫ్ లో కూడా స్క్రీన్ ప్లే కథకి కనెక్ట్ అయ్యేలా బాగా రాసారు. అలాగే ట్రెండ్ కి తగ్గట్టు డైలాగ్స్ వాడారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో రైటర్స్ ని మెచ్చుకోవలసిందే. తమిళ్ డైరెక్టర్ అయినా తెలుగు నేటివిటీతో పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. ఇక గీత ఆర్ట్స్ అంటే నిర్మాణ విలువలు ది బెస్ట్ అని తెలిసిందే.

మొత్తంగా ‘#సింగిల్’ సినిమా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఫుల్ కామెడీతో తెరకెక్కించారు. హ్యాపీగా నవ్వుకోడానికి సినిమా చూసేయొచ్చు. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.