విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘హీరో’

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 10:00 AM IST
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘హీరో’

Updated On : March 13, 2019 / 10:00 AM IST

టాలీవుడ్ టాప్ హీరోలతో వరసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ .. ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోలతో వరసపెట్టి సినిమాలు చేస్తోంది. వీటిలో ఒకటి సెన్సేషనల్ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘డియర్ కామ్రేడ్’. దక్షిణాదిలో విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన విజయ్‌, మరో సినిమాను కూడా మల్టీ లాంగ్వేజ్‌ సినిమాగా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Read Also : RRR Movie : 14న రాజమౌళి ప్రెస్ మీట్ !

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదల కాకుండానే విజయ్ దేవరకొండతో మరో సినిమాను మైత్రీ మూవీస్ ప్రకటించింది. 

తమ సంస్థలో ప్రొడక్షన్ నెం.9ని విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించనున్నట్లు మైత్రీ మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు ఆనంద్ అన్నమలై దర్శకత్వం వహించననున్నట్లు పేర్కొంది. అన్ని దక్షిణాది భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘హీరో’ అని టైటిల్‌ను ఫైనల్‌ చేసినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.