LEO Trailer: లియో ఫీవర్.. థియేటర్‌లో విజయ్ ఫ్యాన్స్ విధ్వంసం.. వీడియో

దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థియేటర్‌లోని కుర్చీలను ఫ్యాన్స్ విరగ్గొట్టారు.

Rohini Theater

Rohini Theater: స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ థియేటర్‌లో హల్‌చల్ చేశారు. విజయ్, సంజయ్ దత్, త్రిష నటించిన లియో సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా తమిళనాడులోని కోయంబేడు రోహిణి థియేటర్‌లో ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థియేటర్‌లోని కుర్చీలను ఫ్యాన్స్ విరగ్గొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని మరికొన్ని థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ, క్రాకర్స్ కాల్చుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కాగా, లియో సినిమాను దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ రూపొందించారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. కాగా, కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ బ్రో సినిమా ట్రైలర్ విడుదల సమయంలోనూ జగదాంబ థియేటర్లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.

LEO Official Trailer: లియో ట్రైలర్ విడుదల.. విజయ్ యాక్షన్ సీన్స్ మామూలుగా లేవు