LEO Official Trailer: లియో ట్రైలర్ విడుదల.. విజయ్ యాక్షన్ సీన్స్ మామూలుగా లేవు

తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

LEO Official Trailer: లియో ట్రైలర్ విడుదల.. విజయ్ యాక్షన్ సీన్స్ మామూలుగా లేవు

LEO Official Trailer

Updated On : October 5, 2023 / 6:57 PM IST

Thalapathy Vijay: స్టార్‌ హీరో దళపతి విజయ్ కొత్త సినిమా ‘లియో’ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. రియల్ టైమ్ వ్యూస్ 5 మిలియన్లు దాటాయని సన్ టీవీ తెలిపింది.

విజయ్ యాక్షన్ సీన్స్ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ రూపొందిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ కథతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తో పాటు గౌతమ్ మీనన్, మిస్కిన్ నటిస్తున్నారు. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్‌ సింగిల్ లాంచ్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్‌ సినిమా తర్వాత విజయ్‌, లోకేశ్‌ కాంబోలో రూపుదిద్దుకున్న రెండో సినిమా ఇది.