Vijay : ఒకప్పుడు ఎత్తుకున్నాడు.. ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చాడు.. తమిళనాడులో వైరల్ అవుతున్న ఇతను ఎవరో తెలుసా?
విజయ్ ఓ కుర్రాడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చర్చగా మారింది. (Vijay)
Vijay
Vijay : తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఏప్రిల్ 23న అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న DMK పార్టీతో పాటు BJP కూటమి, హీరో విజయ్ పార్టీలు పోటాపోటీగా తలపడనున్నాయి. విజయ్ సొంతంగా అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తున్నాడు.
ఈ క్రమంలో విజయ్ ఓ కుర్రాడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చర్చగా మారింది. దీంతో అతను ఎవరు అని వెతికేస్తున్నారు. విజయ్ దగ్గర ఎంతో కాలంగా డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత విజయ్ కి PA గా మారారు రాజేంద్రన్. ఆయన కొడుకు శబరినాథన్ కి విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో విరుగంబక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
Also Read : Sundar C : తమిళనాడు ఎలక్షన్స్.. తన భార్యని అక్క అని పిలుస్తున్నందుకు విజయ్ ని తిట్టడంట..
రాజేంద్రన్ తనయుడు శబరినాథన్ ఎంటెక్ చదివి ఖతార్ లో జాబ్ చేయడానికి వెళ్ళాడు. విజయ్ పార్టీ పెట్టాడని తెలిసి ఆ పార్టీలో చేరతానని తన తండ్రికి చెప్తే ఒప్పుకోలేదు. దీంతో డైరెక్ట్ విజయ్ తో మాట్లాడటంతో విజయ్ రాజేంద్రన్ ని పిలిచి ఒప్పించాడు. 2024 నుంచి విజయ్ TVK పార్టీలో చేరి పని చేస్తున్నాడు శబరినాథన్. మొదట జిల్లా కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు విజయ్. ఇప్పుడు విరుగంబక్కం నియోజకవర్గంకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

ప్రస్తుతం శబరినాథన్ తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఈ క్రమంలో చిన్నప్పుడు విజయ్ తనని ఎత్తుకున్న ఫోటోని, ఇప్పుడు విజయ్ తో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఒకప్పుడు విజయ్ దగ్గర పనిచేసిన డ్రైవర్ కొడుక్కి, తాను ఎత్తుకున్న పిల్లాడికి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో విజయ్ ని అభినందిస్తున్నారు. మరి శబరినాథన్ ఈ ఎన్నికల్లో గెలుస్తాడా లేదా చూడాలి.

Also Read : NTR : రెండు సినిమాలు మొదలయి ఆగిపోయాయి.. కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్..
