Leo vs Pushpa 2 : 32 నిమిషాల్లోనే ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్ చేసిన విజయ్ ‘లియో’..

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ (Vijay) న‌టిస్తున్న సినిమా లియో (LEO). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

Leo vs Pushpa 2 : 32 నిమిషాల్లోనే ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్ చేసిన విజయ్ ‘లియో’..

Leo breaks Pushpa 2 record

Updated On : September 18, 2023 / 7:16 PM IST

Leo : త‌మిళ స్టార్ హీరో విజ‌య్ (Vijay) న‌టిస్తున్న సినిమా లియో (LEO). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తుండ‌గా త‌మిళంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లో అక్టోబ‌ర్ 19న విడుద‌ల కానుంది.

ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా మొద‌టి తెలుగు పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేసింది. హీరో విజ‌య్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పోస్ట‌ర్ కేవ‌లం 32 నిమిషాల్లో మిలియ‌న్ లైక్స్ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప 2 పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప 2 సినిమాల్లోంచి ఆ మ‌ధ్య అల్లు అర్జున్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేయ‌గా 33 నిమిషాల్లో మిలియ‌న్ లైక్స్ సాధించింది.

Ram Charan : ‘క్లీంకార’కు గ్రాండ్ వెల్కమ్ పలికిన రామ్ చరణ్.. చిన్న జీయర్ స్వామి..

అర్జున్‌, సంజ‌య్ ద‌త్‌, గౌత‌మ్ వాసుదేవ్ మేన‌న్‌, మిస్కిన్, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ లు లియో సినిమాలో కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్.లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా జగదీష్ పళనిస్వామి సహ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తోంది. ఈ చిత్రం ద్వారానే సితార సంస్థ పంపిణీ రంగంలోకి అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Vijay (@actorvijay)