LEO : లియో నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. రూ.1000 కోట్లు రావు.. రెండు లక్షల మంది పక్క రాష్ట్రాలకు..
ఇళయ దళపతి విజయ్ నటించిన చిత్రం లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్.

Leo Collections
Leo Collections : ఇళయ దళపతి విజయ్ నటించిన చిత్రం లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్. అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ మొదటి రోజు ఈ చిత్రం దాదాపుగా రూ.148 కోట్లు రాబట్టినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇక రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లను రాబట్టింది.
అయితే.. ఈ సినిమా వసూళ్లపై చిత్ర నిర్మాత లలిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లియో సినిమా రూ.1000 కోట్ల వసూళ్లను సాధిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. తాను అలా చెప్పడానికి ఓ కారణం ఉందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఉదయం నాలుగు గంటలకు స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతి రాలేదని, దీంతో దాదాపు రెండు లక్షల మంది వేరే రాష్ట్రాలకు వెళ్లి అక్కడ లియో సినిమా చూశారని చెప్పాడు. అంతేకాకుండా హిందీ మార్కెట్ నుంచి భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం లేదన్నారు.
Chandramukhi 2 : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చంద్రముఖి.. ఎప్పుడు, ఎక్కడ తెలుసా..?
మొదటగా లియో సినిమాకు వస్తున్న స్పందనను చూస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని లలిత్ కుమార్ చెప్పారు. ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్ షోస్ కోసం ఎంతగానో ప్రయత్నించినట్లు చెప్పారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించాం. అయితే.. విజయ్ మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో సినిమా విడుదల కావాలని కోరుకున్నారు. సినిమా విడుదలైన తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేసి అభినందించారని చెప్పారు. హిందీ మార్కెట్ నుంచి భారీ వసూళ్లను ఆశించడం లేదని, అందుకనే మా చిత్రం రూ.1000 కోట్ల వసూళ్లను అందుకోకపోవచ్చునన్నారు.