Vijay Milton Raj Tharun combo movie title is Gods and Soldiers
Gods and Soldiers : గోలీసోడా, గోలీసోడా-2 చిత్రాల దర్శకుడు, ప్రముఖ కెమెరామెన్ విజయ్ మిల్టన్ డైరెక్షన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ బాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీతోనే రాజ్‌తరుణ్ తమిళంలో ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ చిత్రంలో సునీల్, వేదన్, భారత్, అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు.
Anushka : ఘాటీ ప్రమోషన్స్‌కు దూరంగా అనుష్క.. కారణం ఇదేనా..?
ఈ చిత్రానికి గాడ్స్ అండ్ సోల్జర్ (Gods and Soldiers) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. గోలీసోడాలోని రఫ్‌నెస్‌ను, న్యూ చాప్టర్‌లో ఈ సినిమాలో ఆడియన్స్ చూడబోతున్నారని అన్నాడు. టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వస్తోందని తెలిపాడు. ఈ చిత్రం రెండు భాషల్లోని ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.