Anushka : ఘాటీ ప్రమోషన్స్‌కు దూరంగా అనుష్క.. కారణం ఇదేనా..?

అనుష్క (Anushka) శెట్టి నటించిన ఘాటీ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో..

Anushka : ఘాటీ ప్రమోషన్స్‌కు దూరంగా అనుష్క.. కారణం ఇదేనా..?

Why Anushka Silent in Ghaati Movie Promotions

Updated On : August 28, 2025 / 12:31 PM IST

Anushka : అనుష్క శెట్టి నటించిన ఘాటీ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ పిక్చర్‌ కోసం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ మూవీపై అంచనాలు పెంచాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా, గంజాయి మాఫియా నేపథ్యంలో అనుష్క (Anushka) శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో అనుష్క ఎక్కడా కనిపించకపోవడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. అయితే ఈ మూవీకి కమిట్‌ అయ్యే కంటే ముందే ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనని చెప్పేసిందట. ప్రమోషన్స్‌లో పాల్గొనని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానులను నిరాశపరిచింది.

Mirai Trailer : తేజ సజ్జా ‘మిరాయ్‌’ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా..

ఒక ఎక్స్ పోస్ట్‌లో ఘాటి నిర్మాత ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, అనుష్క ప్రమోషన్స్‌లో కనిపించకపోవడం ఒప్పందంలో భాగమని, షూటింగ్ మొదలు పెట్టే ముందే ఈ చర్చలు జరిగాయని స్పష్టం. ఈ నిర్ణయం వెనుక అనుష్క వ్యక్తిగత కారణాలు లేదా ఇతర సినిమా కమిట్‌మెంట్స్ ఉన్నాయా అనే చర్చ సాగుతోంది.

అనుష్క లేకపోయినా, ఘాటి టీమ్ ప్రమోషన్స్‌ చేపట్టింది. ట్రైలర్‌లో అనుష్క గిరిజన మహిళగా, గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ మూవీ డెవలప్‌మెంట్స్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

NTR : నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇక ఆ సినిమా లేనట్టే..

అయితే అనుష్క ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ డిసప్పాయింగ్ అవుతున్నారు. ఒకవేళ ప్రీరిలీజ్ ఈవెంట్‌ నిర్వహించే ఆ ప్రోగ్రామ్‌కు అయినా అనుష్క వస్తుందా రాదా అనేది డిస్కషన్ పాయింట్‌గా మారింది. అయితే మూవీ ప్యాకప్‌ వరకే అనుష్క రోల్ అయిపోయిందని..ఘాటి ప్రమోషన్స్‌, సక్సెస్‌ మీట్‌..ఆ మూవీ ఈవెంట్‌ ఏదైనా స్వీటీ అటెండ్ కారని అంటున్నారు.