Merry Christmas : సంక్రాంతికి వస్తున్న క్రిస్మస్.. మహేష్‌కి పోటీగా రాబోతున్నారా..?

విజ‌య్ సేతుప‌తి, క‌త్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రీ క్రిస్మ‌స్‌' సినిమా మహేష్ కి పోటీగా రాబోతోందా..?

Vijay Sethupathi Katrina Kaif Merry Christmas is postponed to january

Merry Christmas : క్రిస్మస్ సంక్రాంతికి రావడం ఏంటని అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. కోలీవుడ్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి, బాలీవుడ్ నటి క‌త్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రీ క్రిస్మ‌స్‌’ అనే సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుంది. హిందీ దర్శకుడు శ్రీ రామ్ రాఘ‌వ‌న్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. తమిళ్, హిందీలో లాంగ్వేజ్స్ లో బై లింగువల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని.. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా తీసుకు వస్తున్నట్లు గతంలో ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఆ రిలీజ్ ని పోస్టుపోన్ చేస్తూ సంక్రాంతికి తీసుకు వెళ్లారు. జనవరి 12న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బై లింగువల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అయితే జనవరి 12న మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హనుమాన్’ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు తెలుగు చిత్రాల మధ్య ఈ డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ కాబోతుందా..? తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరుకుతాయా..? అనే సందేహం కలుగుతుంది.

Also read : SS Thaman : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బర్త్ డే స్పెషల్

ఎందుకంటే సంక్రాంతి రేసులో మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. వెంకటేష్ ‘సైంధవ్‌’, రవితేజ ‘ఈగల్’ చిత్రాలు జనవరి 13న రిలీజ్ అవుతున్నాయి. ఇక నాగార్జున ‘నా సామిరంగ’, విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఫ్యామిలీ స్టార్’, రజినీకాంత్ ‘లాల్ సలామ్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా కచ్చితమైన డేట్ అనౌన్స్ చేయనప్పటికీ సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించారు. మరి ఇంత కాంపిటీషన్ మధ్య ‘మెర్రీ క్రిస్మ‌స్‌’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తారా..? లేదా మొదటిగా హిందీ, తమిళంలో రిలీజ్ చేసి ఆ తరువాత తెలుగులో రిలీజ్ చేస్తారా..? అనేది చూడాలి.

కాగా బై లింగువల్ గా తెరకెక్కుతున్న ‘మెర్రీ క్రిస్మ‌స్‌’ హిందీ వెర్షన్‌లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్ను ఆనంద్ కనిపించనున్నారు. తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ పోస్టర్స్ ని మాత్రం రిలీజ్ చేస్తూ వచ్చారు. ఈ మూవీ నుంచి ఒక టీజర్ అయినా రిలీజ్ అయితే.. కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.