SS Thaman : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బర్త్ డే స్పెషల్

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. అగ్రహీరోలందరికి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ కంపోజర్‌గా మారారు. క్షణం తీరిక లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగీత సంచలనం ఎస్ఎస్.తమన్ బర్త్ డే ఈరోజు.

SS Thaman : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బర్త్ డే స్పెషల్

SS Taman

Updated On : November 16, 2023 / 12:09 PM IST

SS Taman : నటుడిగా ఎంట్రీ ఇచ్చి  మ్యూజిక్  డైరెక్టర్‌గా టర్న్ తీసుకుని అంచెలంచెలుగా ఎదిగిన సంగీత సంచలనం ఎస్ఎస్ తమన్. టాలీవుడ్‌లో దాదాపుగా టాప్ హీరోలందరి సినిమాలకు సంగీతం అందించారు. తెలుగు సినిమాలకు నాన్ స్టాప్‌గా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న తమన్ బర్త్ డే ఈరోజు.

Mahesh Babu : కృష్ణ వర్ధంతి రోజు మహేష్ బాబు మరో గొప్ప నిర్ణయం..

తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. తమన్ తాతగారు అలనాటి దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. తమన్ తండ్రి శివకుమార్ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర 700 వందల సినిమాలకు డ్రమ్మర్‌గా పనిచేశారు. తమన్ తల్లి సావిత్రి, అత్త పి.వసంతలు గాయనీమణులే. అలా తమన్ కుటుంబమంతా సంగీత నేపథ్యం నుంచి వచ్చినవారే. వారి నుంచి తమన్‌కి సంగీతం పట్ల మక్కువ ఏర్పడిందట.

తెలుగు, తమిళ్ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న తమన్ మొదట నటుడిగా బాయ్స్ సినిమాలో నటించారు. తర్వాత పూర్తిగా సంగీతం వైపు మళ్లారు. రాజ్-కోటి, వందేమాతరం శ్రీనివాస్, చక్రి, ఆర్పీ.పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల వద్ద కీబోర్డు ప్లేయర్ గా పనిచేసారు. 2008 లో తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన మొదటి సినిమా ‘మళ్లీ మళ్లీ’. ఆ తర్వాత 2010 లో రవితేజ ‘కిక్’ సినిమాకి సంగీతం అందించారు. ఆ తర్వాత నాన్ స్టాప్‌గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. బృందావనం, రగడ, మిరపకాయ్, దూకుడు, బాడీగార్డ్, బిజినెస్ మేన్, నిప్పు, నాయక్, గ్రీకు వీరుడు, బలుపు, రామయ్యా వస్తావయ్యా, మసాలా, రేసుగుర్రం, పవర్ ఆగడు, కిక్ 2, సరైనోడు, విన్నర్, జవాన్, అరవింద సమేత వీర రాఘవ, వకీల్ సాబ్.. ఇలా నాన్ స్టాప్‌గా పెద్ద స్టార్ల సినిమాలకు సంగీతం అందించారు తమన్.

Rashmika : రష్మిక ఫేక్ వీడియో పై మాట్లాడిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్..

తమన్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాదు సింగర్‌గా కూడా అనేక పాటలు పాడారు. మిరపకాయ్ సినిమాలో వైశాలి వైశాలి, ఆగడు నారీ నారీ, బిజినెస్ మేన్‌లో సారొస్తారా, బలుపులో కాజల్ చెల్లివా, తొలిప్రేమలో నిన్నిలా వంటి హిట్ సాంగ్స్ పాడారు తమన్. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అని లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు తమన్. తమిళ్, కన్నడ, మళయాళం, హిందీలో కూడా తన స్వరాలతో మెస్మరైజ్ చేశారు. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని చెప్పాలి. 2023 లో వారసుడు, వీరసింహారెడ్డి, బ్రో, స్కంద, భగవంత్ కేసరి సినిమాలకు సంగీతం అందించిన తమన్ చేతిలో ప్రస్తుతం ‘గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, ఓజీ, రవితేజ-మలినేని’ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.