Mahesh Babu : కృష్ణ వర్ధంతి రోజు మహేష్ బాబు మరో గొప్ప నిర్ణయం..

కృష్ణ వర్ధంతి రోజు మహేష్ బాబు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ అంటూ..

Mahesh Babu : కృష్ణ వర్ధంతి రోజు మహేష్ బాబు మరో గొప్ప నిర్ణయం..

Mahesh Babu launched the Superstar Krishna Educational Fund

Updated On : November 16, 2023 / 10:49 AM IST

Mahesh Babu : గత ఏడాది నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. కాగా నిన్నటితో ఆయన మరణించి సంవత్సరం కావడంతో.. నిన్న హైదరాబాద్ లో ఘట్టమనేని కుటుంబం ఆయనను గుర్తు చేసుకుంటూ ఒక స్మారక దినం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కృష్ణకి అందరూ నివాళ్లు అర్పించి ఆయనను, ఆయన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ స్మారక దినంకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా మహేష్, కృష్ణ వర్ధంతి రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ అంటూ కొత్త కార్యక్రమం మొదలు పెట్టారు. పేదరికం వల్ల చదువుకోలేని 40 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా మహేష్ బాబు చదువుని అందించబోతున్నారు. పాఠశాల నుంచి కాలేజీ వరకు వారి విద్యా భాద్యతలు అన్ని మహేష్ బాబే తీసుకునున్నారు. విద్యార్థులు కలలకు తాను మార్గం కానున్నారు. ఇక ఈ నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read : Anushka Sharma Viral Post : భర్త కోహ్లీపై అనుష్కా శర్మ తాజా కామెంట్… వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టు

MB ఫౌండేషన్ ద్వారా మహేష్ బాబు ఎంతో మంది పిల్లలకు గుండె చికిత్సలు చేయించి.. వారి ముఖాల్లో చిరు నవ్వు అవుతున్నారు. ఇప్పుడు వారి భవిషత్తుకు కూడా నవ్వుల బాట వేస్తున్నారు. కాగా మహేష్ బాబు వారసులు గౌతమ్, సితార కూడా తండ్రి అనుసరిస్తూ అదే మార్గంలో వెళ్తున్నారు. చిన్నతనంలో వారి గొప్ప మనసుని చాటుకుంటున్నారు. తమ బర్త్ డేలను పేద పిల్లలతో జరుపుకుంటూ, వారికీ సహాయం అందిస్తూ అభిమానుల మనసుని గెలుచుకుంటూ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటూ వెళ్తున్నారు.