Vijay Sethupathi : తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి నెక్స్ట్ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా? తెలుగులో కూడా..

విజయ్ సేతుపతి నెక్స్ట్ సినిమా తెలుగు - తమిళ్ లో ఒకేసారి రిలీజ్ అవుతుంది.

Vijay Sethupathi Next Movie Ace Releasing in Tamil and Telugu

Vijay Sethupathi : తమిళ్ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ అందర్నీ మెప్పిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తెలుగులో కూడా విజయ్ సేతుపతికి మంచి మార్కెట్ ఏర్పడింది. విజయ్ సేతుపతి నెక్స్ట్ సినిమా తెలుగు – తమిళ్ లో ఒకేసారి రిలీజ్ అవుతుంది.

విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా దివ్య పిళ్ళై, బబ్లూ పృథ్వీరాజ్, రుక్మిణి మైత్ర, యోగిబాబు.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఏస్’. 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అరుముగ కుమార్ దర్శక నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మే 23న తెలుగు – తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Also Read : Anasuya Bharadwaj : అనాథ పిల్లలతో అనసూయ.. భోజనం పెట్టి, బుక్స్ ఇచ్చి, వాళ్ళతో స్టెప్పులు వేసి.. ఫొటోలు వైరల్..

విజయ్ సేతుపతి ఏస్ సినిమాని తెలుగులో శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ పై బి.శివ ప్రసాద్ రిలీజ్ చేయబోతున్నారు. గతంలో నిర్మాతగా రా రాజా సినిమా తెరకెక్కించిన శివ ప్రసాద్ ఇప్పుడు పోటీపడి మరీ విజయ్ సేతుపతి ‘ఏస్’ తెలుగు హక్కులను దక్కించుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Also Read : HariHara VeeraMallu : ఆలస్యంతో పెరిగిన ‘హరిహర వీరమల్లు’ బడ్జెట్.. ఎంతో తెలుసా? పవన్ అన్ని కోట్లు కలెక్షన్స్ రప్పిస్తాడా?