HariHara VeeraMallu : ఆలస్యంతో పెరిగిన ‘హరిహర వీరమల్లు’ బడ్జెట్.. ఎంతో తెలుసా? పవన్ అన్ని కోట్లు కలెక్షన్స్ రప్పిస్తాడా?

ఎట్టకేలకు పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయడంతో జూన్ 12న ఈ సినిమా రానుంది.

HariHara VeeraMallu : ఆలస్యంతో పెరిగిన ‘హరిహర వీరమల్లు’ బడ్జెట్.. ఎంతో తెలుసా? పవన్ అన్ని కోట్లు కలెక్షన్స్ రప్పిస్తాడా?

Pawan Kalyan HariHara VeeraMallu Movie Budget Increased Doubt in Collections

Updated On : May 18, 2025 / 9:16 AM IST

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ రాజకీయాల బిజీ వల్ల చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయడానికి ఆలస్యం అవుతుంది. ఎప్పుడో ఆరేళ్ళ క్రితం మొదలయిన సినిమా ఇన్నాళ్లకు బయటకు రాబోతుంది. ఎట్టకేలకు పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయడంతో జూన్ 12న ఈ సినిమా రానుంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు, పవన్ మొదటి పాన్ ఇండియా అని చెప్పడం, రెండు పార్ట్స్ అని చెప్పడం, మొదట్లో వచ్చిన యాక్షన్ గ్లింప్స్ చూసి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పవన్ పాన్ ఇండియా రికార్డులు కొడతాడు అని అంతా అనుకున్నారు.

కానీ కరోనా వల్ల, పవన్ రాజకీయాల వల్ల సినిమా ఆలస్యం అవడం, డైరెక్టర్ క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం, OG పై హైప్ పెరగడం, రెండు పార్ట్స్ ఉంటాయో లేదో అని సందిగ్దత నెలకొనడం.. ఇవన్ని హరిహర వీరమల్లు మీద ఆసక్తి తగ్గేలా చేసాయి. అసలు పవన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే పండగలా ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాలు. కానీ హరిహర వీరమల్లు సినిమాకు బజ్ కనిపించడం లేదు.

Also Read : Anasuya Bharadwaj : అనాథ పిల్లలతో అనసూయ.. భోజనం పెట్టి, బుక్స్ ఇచ్చి, వాళ్ళతో స్టెప్పులు వేసి.. ఫొటోలు వైరల్..

షూటింగ్స్ ఆలస్యం చేయడంతో, సెట్స్ మళ్ళీ పవన్ కి అనుకూలంగా ఉండటానికి మంగళగిరి దగ్గర వేయడంతో, గ్రాఫిక్స్ పార్ట్ కూడా పెరగడంతో ఖర్చు భారీగానే అయిందట. ముందు ఈ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ కాకుండా 100 నుంచి 150 కోట్లు బడ్జెట్ అనుకున్నారట. ఆలస్యం అయ్యేకొద్దీ అమృతం విషం అన్నట్టు సినిమా ఒకటికి రెండు సార్లు మొదలయి వాయిదా పడటం, వడ్డీలు పెరిగిపోవడంతో హరిహర వీరమల్లు బడ్జెట్ దాదాపు 200 కోట్లు దాటేసిందని సమాచారం.

కనీసం నిర్మాతకు 250 నుంచి 300 కోట్లు చేతికి వస్తే కానీ సేఫ్ అవ్వడు. అయితే అమెజాన్ సంస్థ 50 కోట్లకు ఓటీటీ రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 125 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ సినిమాపై బజ్ లేకపోవడంతో అంత కష్టమే అంటున్నారు. ఆడియో రైట్స్ కూడా ఓ 15 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తుంది. మరి నిర్మాత ఏఎం రత్నం ఏం చేస్తారో చూడాలి.

Also Read : అల్లు అర్జున్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌తో సినిమాలు తీస్తే ఇలాంటి మూవీస్ తీస్తాను: నిహారిక

ఇక థియేటరికల్ రైట్స్ వరల్డ్ వైడ్ 125 కోట్లకు అమ్ముడుపోతే కనీసం 250 కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పటివరకు పవన్ కి 100 కోట్ల సినిమాలే. ఆ మార్కెట్ దాటి ఇప్పుడు 250 కోట్లు థియేటర్స్ నుంచి రావాలంటే మ్యాజిక్ జరగాల్సిందే. పెరిగిన టికెట్ రేట్లు, జనాలు థియేటర్స్ కి రాకపోవడం, పవన్ వ్యతిరేకులు సినిమాలపై కూడా నెగిటివ్ ప్రచారం చేయడం.. ఇలాంటివన్నీ దాటుకొని పవన్ భారీ కలెక్షన్స్ హరిహర వీరమల్లుకి తెప్పించాలి.