హిజ్రాగా అదరగొట్టిన విజయ్ సేతుపతి

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 09:26 AM IST
హిజ్రాగా అదరగొట్టిన విజయ్ సేతుపతి

Updated On : March 29, 2019 / 9:26 AM IST

హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. అంతేకాదు సినిమాల్లో  హిజ్రా పాత్ర వేయటం ఓ సాహసమనే చెప్పాలి. అటువంటి పాత్రలు చేసేందుకు హీరో వెనుకాడుతుంటారు. కానీ వైవిధ్యమైన పాత్రలు చేయాలనే తపన వున్న ముఖ్యంగా నటనకు ప్రాధాన్యతనివ్వాలనుకునేవారు మాత్రం ఏమాత్రం వెనుకాడరు. ఈ కోవకు చెందినవాడే తమిళ నటుడు విజయ్ సేతుపతి. 
 

తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి హీరోగా చేస్తూనే .. ప్రాధాన్యత ఉంటే కీలకమైన పాత్రల్లో చేయటం సేతుపతి స్లైల్. విభిన్నమైన..విలక్షణమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అలాంటి సాహసాన్ని విజయ్ సేతుపతి చాలా తేలికగా చేసేశాడు. హిజ్రా పాత్రను పోషించిన ‘సూపర్ డీలక్స్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసినవాళ్లంతా..హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడని అంటున్నారు. సినీ విశ్లేషకులు సైతనం సేతుపతి నటనకి నూటికి నూరు మార్కులు ఇచ్చేస్తున్నారట. అతని కెరియర్లో ఈ హిజ్రా పాత్ర చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.