Vijay Sethupathi Rukmini Vasanth Yogi Babu Ace Trailer Released
Ace Trailer : విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా దివ్య పిళ్ళై, బబ్లూ పృథ్వీరాజ్, రుక్మిణి మైత్ర, యోగిబాబు.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఏస్’. 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అరుముగ కుమార్ దర్శక నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మే 23న తెలుగు – తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాని శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత బి.శివ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Manchu Manoj : నాకు ‘మా’లో మెంబర్ షిప్ ఇవ్వలేదు.. 8 ఏళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉండటంపై మనోజ్ కామెంట్స్..
తాజాగా ఏస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్‌లో.. నా పేరు బోల్ట్ కాశీ అని హీరో పరిచయం, యోగిబాబు కామెడీ, హీరో హీరోయిన్ల ప్రేమ, మలేసియాలో జరిగే ఇల్లీగల్ కార్యకలాపాలు, చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో.. సాగింది. అసలు హీరో దేని కోసం పోరాటం చేస్తున్నాడు అని ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. మీరు కూడా ఏస్ తెలుగు ట్రైలర్ చూసేయండి..