Vijay Sethupathi: ఇకపై కృతిశెట్టితో కలిసి నటించడం నా వల్ల కాదు

ఉప్పెన సినిమా విజయంలో కీలక పాత్ర విజయ్ సేతుపతి, కృతిశెట్టి. తన అమాయకమైన అందంతో కృతి కుర్రాళ్ళ గుండెలను గిల్లేస్తే.. తనదైన క్రూరుడిగా విజయ్ సేతుపతి అభినయంతో..

Vijay Sethupathi: ఇకపై కృతిశెట్టితో కలిసి నటించడం నా వల్ల కాదు

Vijay Sethupathi

Updated On : September 6, 2021 / 1:31 PM IST

Vijay Sethupathi: ఉప్పెన సినిమా విజయంలో కీలక పాత్ర విజయ్ సేతుపతి, కృతిశెట్టి. తన అమాయకమైన అందంతో కృతి కుర్రాళ్ళ గుండెలను గిల్లేస్తే.. తనదైన క్రూరుడిగా విజయ్ సేతుపతి అభినయంతో అదరగొట్టేశాడు. బేబమ్మ, రాయణం పాత్రలో వీరిద్దరి నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే.. నిజానికి ఈ సినిమాలో విజయ్ సేతుపతి వయసుకి మించిన పాత్రే చేశాడు. ప్రస్తుతం విజయ్ ఇప్పటికీ తమిళంలో హీరోగా మంచి అవకాశాలే వస్తుండగా ఇతర బాషలలో వైవిధ్యమైన పాత్రలతో దూసుకెళ్తున్నాడు.

కాగా, శృతిహాసన్ తో కలిసి నటించిన లాభం సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉప్పెన సినిమా తర్వాత తమిళంలో నటించిన ఓ సినిమాలో మొదట హీరోయిన్‌గా కృతిశెట్టి అయితే బావుంటుందని టీం అనున్నారట. కానీ, అందుకు విజయ్ ఒప్పుకోలేదట. ఉప్పెన సినిమాలో ఆమెకు తండ్రిగా నటించి, ఇప్పుడు ఆమెతో రొమాన్స్‌ చేయమంటే చేయలేనని చెప్పాడట. అప్పుడే కాదు ఇకపై కూడా ఆమెతో కలిసి జంటగా నటించలేదని చెప్పాడు. ఎందుకంటే దానికి విజయ్ మరో కారణం చెప్పాడు.

ఉప్పెన సినిమాలో క్లైమాక్స్‌ చాలా కీలకం. ఇందులో విజయ్, కృతి నటన అందరినీ కట్టిపడేసింది. కాగా ఈ సీన్స్ షూట్‌ చేస్తున్నప్పుడు కృతి కంగారు పడితే విజయ్ ధైర్యం చెప్పాడట. నాకు నీ అంత వయసున్న కొడుకున్నాడు.. నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. భయపడకు.. ధైర్యంగా చెయ్‌ అని కృతిని ప్రోత్సహించాడట. అందుకే కూతురిలా భావించిన కృతిశెట్టితో జోడీలా నటించడం తన వల్ల కాదని చెప్పేశాడు సేతుపతి.