Vijay Sethupathi Stunning Transformation Becomes Talk Of The Town
Vijay Sethupathi: తమిళ సినీ ఇండస్ట్రీలో వర్సెటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న యాక్టర్ విజయ్ సేతుపతి, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇక ఈ యాక్టర్ తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి ‘ఉప్పెన’లా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచేసుకున్నాడు. విజయ్ సేతుపతి సినిమా వస్తుందంటే, అది ఖచ్చితంగా తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అంతలా తన యాక్టింగ్‌తో మ్యాజిక్ చేస్తున్న ఈ యాక్టర్, కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.
Vijay Sethupathi : విజయ్ సేతుపతి సినిమా సెట్‌లో విషాదం..
అయితే విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతి కాస్త లావుగా కనిపించడంతో అభిమానులు ఆయన సన్నబడితే బాగుంటుందని కోరుకున్నారు. కాగా, తాజాగా విజయ్ సేతుపతి స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. స్లిమ్‌గా మారి, బరువు తగ్గిన లుక్‌తో విజయ్ సేతుపతిని చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. మరీ ఇంత స్లిమ్‌గా ఎలా మారారు అంటూ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.
కేవలం స్టార్ హీరోలే కాదు, తలుచుకుంటే ఎవరైనా స్లిమ్‌గా మారవచ్చని విజయ్ సేతుపతి ప్రూవ్ చేశాడు. దీంతో ఇప్పుడు స్లిమ్ లుక్‌లో ఉన్న విజయ్ సేతుపతి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్న ఫోటోను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.