Vijay Sethupathi : షారుఖ్ కి విలన్ గా విజయ్ సేతుపతి.. ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్.. ఈ సారి బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..

జవాన్ సినిమాలో విలన్ రోల్ కి విజయ్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది. సాధారణంగా విజయ్ సేతుపతి సౌత్ లో సినిమాకి 5 నుంచి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఇటీవల విక్రమ్ హిట్ అయి అందులో సంతానం పాత్ర బాగా రీచ్ అవ్వడంతో

Vijay Sethupathi : షారుఖ్ కి విలన్ గా విజయ్ సేతుపతి.. ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్.. ఈ సారి బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..

Vijay Sethupathi taking highest remunaration for bollywood Jawan Movie

Vijay Sethupathi :  విజయ్ సేతుపతి.. మక్కల్ సెల్వన్.. హీరోగా కెరీర్ ఉన్న సమయంలోనే నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని విలన్ క్యారెక్టర్స్ తో అదరగొడుతున్నాడు. తమిళనాడులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు ఇండియా వైడ్ తన కొత్త విలనిజంతో అభిమానులని సంపాదించుకుంటున్నాడు. ఉప్పెన, మాస్టర్, విక్రమ్ సినిమాల్లో తన విలనిజంతో సౌత్ లో టాప్ విలన్ గా మారాడు. స్టార్ హీరోలకి విలన్ కావాలంటే ఇప్పుడు అందరికి విజయ్ సేతుపతి గుర్తొచ్చేలా చేశాడు.

ఇన్ని రోజులు సౌత్ లో స్టార్ గా ఎదిగిన విజయ్ ఇప్పుడు తన విలనిజాన్ని బాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా, నయనతార హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా జవాన్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు అని తెలియడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సారి విజయ్ సేతుపతి విలనిజానికి బాలీవుడ్ కూడా షేక్ అవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు.

Mahesh Babu : సితారతో కలిసి డ్యాన్స్ షోలో మెరిసిన మహేష్.. ఫుల్ ఖుషి అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

అయితే జవాన్ సినిమాలో విలన్ రోల్ కి విజయ్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది. సాధారణంగా విజయ్ సేతుపతి సౌత్ లో సినిమాకి 5 నుంచి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఇటీవల విక్రమ్ హిట్ అయి అందులో సంతానం పాత్ర బాగా రీచ్ అవ్వడంతో తన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లో జవాన్ సినిమాకి ఏకంగా 20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. ఇది తెలిసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఆల్రెడీ నేషనల్ అవార్డు సాధించిన విజయ్ నటనని ఇంత రెమ్యునరేషన్ ఇప్పించి డైరెక్టర్ అట్లీ ఏ రేంజ్ లో వాడుకుంటాడో చూడాలి. షారుఖ్ ఫ్యాన్స్ తో పాటు విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కూడా జవాన్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.