Tamannaah : తమన్నా సినిమా దేవత అంటూ.. పొగిడేసిన ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ

తాజాగా జైలర్ సినిమా నుంచి 'కావాలా..' అనే ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో తమన్నా హాట్ హాట్ స్టెప్స్ తో రెచ్చిపోయింది.

Tamannaah : తమన్నా సినిమా దేవత అంటూ.. పొగిడేసిన ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ

Vijay Varma Praises his Girlfriend Tamannaah as Cinema Goddess

Updated On : July 11, 2023 / 7:50 AM IST

Tamannaah Vijay Varma :  తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తోంది. గత కొన్నాళ్లుగా తమన్నా రిలేషన్ షిప్ గురించి అనేక వార్తలు రాగా ఇటీవలే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది. వీరి రిలేషన్ ని అధికారికంగానే వీరిద్దరూ మీడియా ముందు ఒప్పుకున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ 2 సినిమా కలిసి చేశారు.

ప్రస్తుతం తమన్నా రజినీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. తాజాగా జైలర్ సినిమా నుంచి ‘కావాలా..’ అనే ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో తమన్నా హాట్ హాట్ స్టెప్స్ తో రెచ్చిపోయింది. ఈ పాటలో రజినీకాంత్ కూడా స్టెప్పులు వేశారు. ఈ పాట కంటే కూడా ఇందులో తమన్నా వేసిన స్టెప్పులు వైరల్ గా మారాయి. దీంతో ఈ పాటని విజయ్ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.

Vijay Varma Praises his Girlfriend Tamannaah as Cinema Goddess

 

Suchitra Krishnamoorthi : ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అయినా నా భర్తే నన్ను మోసం చేశాడు..

ఈ పాటను షేర్ చేస్తూ.. ఈ సాంగ్ ఫైర్.. సినిమా దేవుడు, దేవత అని పోస్ట్ చేశాడు. అంటే పాటలో సినిమా దేవుడు రజినీకాంత్, సినిమా దేవత తమన్నా ఉన్నారు అంటూ చెప్పాడు. అయితే ఈ పొగడ్త మరీ ఓవర్ అయిందని పలువురు కామెంట్స్ చేస్తుండగా, గర్ల్ ఫ్రెండ్‌ని బాగానే పొగుడుతున్నారు అంటూ కొంతమంది పాజిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విజయ్ వర్మ తమన్నాని సినిమా దేవత అంటూ పొగడటం వైరల్ గా మారింది.