‘సబ్జెక్టు బాగుండాలి.. పాత్ర దద్దరిల్లాలి అప్పుడే రాములమ్మ చేస్తది’

వరంగల్ వేదికగా ఏర్పాటు చేసిన సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ జోష్ ఫుల్ గా జరిగింది. మహేశ్ బాబు, రష్మిక మంధాన, విజయ శాంతి, అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్‌లంతా ప్రోగ్రాంకు వచ్చి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. విజయశాంతి అభిమానులే కాదు.. ప్రజలంతా నా వాళ్లు. నేను ప్రజల మనిషిని అంటూ ఆకట్టుకునే స్పీచ్ ఇచ్చారు.
=> విజయశాంతి పేరు మర్చిపోయారు. రాములమ్మ అని పిలుస్తున్నారు. భారతి అని కూడా అంటున్నారు.
=>జవాన్ తల్లుల ఫీలింగ్ గురించి చెప్పిన కథ ఇది.
=>సమాజంలో మార్పు రావాలి. మంచి జరగాలి. ఎంతమంది జవాన్లు మనదేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు..
=>సూపర్ స్టార్ మహేశ్ బాబు నేను కలిసి నటించాం. సరిలేరు నీకెవ్వరు కలిసినటించాం. అదీ.. ఇదీ సూపర్ డూపర్ హిట్.
=>కలిసి నటించడం అనే సెంటిమెంట్ వర్కవుట్ అయింది.
=>రష్మిక, సంగీత, ప్రకాశ్ రాజ్, రావూరి రమేశ్ అంతా బాగా చేశారు. వారందరికీ అభినందనలు.
=>సబ్జెక్టు బాగుండాలి.. పాత్ర దద్దరిల్లాలి అప్పుడే రాములమ్మ చేస్తది. ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేసే మనిషిని.
=>మీరంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వారంలో వంద కోట్లు వసూలు చేసిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.