Vijayasai Reddy : తగ్గేదేలే అంటున్న విజయసాయిరెడ్డి.. ‘పుష్ప’పై స్పెషల్ ట్వీట్..

పుష్ప సినిమా సైమాలో ఏకంగా ఆరు అవార్డులు సాధించడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పెషల్ ట్వీట్ చేశారు. రాజకీయాలతో పాటు, పలు అంశాలపై కూడా ట్వీట్స్ చేసే విజయసాయిరెడ్డి తాజాగా పుష్ప సినిమాపై.........

Vijayasai Reddy : తగ్గేదేలే అంటున్న విజయసాయిరెడ్డి.. ‘పుష్ప’పై స్పెషల్ ట్వీట్..

Vijayasai Reddy special tweet on Pushpa Movie

Updated On : September 13, 2022 / 12:48 PM IST

Vijayasai Reddy :  పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తగ్గేదేలే అంటూ అల్లుఅర్జున్ చేసిన మేనరిజం, పాటలు, స్టెప్పులు అయితే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. చాలా మంది ప్రముఖులు తగ్గేదేలే అంటూ డైలాగ్స్ చెప్పారు. ఇన్ని రోజులు ప్రేక్షకులని అలరించిన పుష్ప సినిమా ఇప్పుడు అవార్డులు అందుకుంటుంది.

తాజాగా సైమా అవార్డు వేడుకలని బెంగళూరులో నిర్వహించారు. ఈ సైమా వేడుకల్లో పుష్ప సినిమా మొత్తం ఆరు కేటగిరీల్లో అవార్డులు అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సాహిత్య రచయిత ఇలా మొత్తం ఆరు కేటగిరీల్లో పుష్ప సినిమా సైమా అవార్డులను అందుకుంది. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు.

AHA Dance Icon : ‘ఆహా’ డ్యాన్స్ ఐకాన్.. ఎపిసోడ్ ప్రోమో.. పూనకాలే..

పుష్ప సినిమా సైమాలో ఏకంగా ఆరు అవార్డులు సాధించడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పెషల్ ట్వీట్ చేశారు. రాజకీయాలతో పాటు, పలు అంశాలపై కూడా ట్వీట్స్ చేసే విజయసాయిరెడ్డి తాజాగా పుష్ప సినిమాపై ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో.. ”పాన్ ఇండియా మూవీగా రికార్డ్స్ బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాచాటి ఏకంగా 6 అవార్డులు గెలుచుకున్న ‘పుష్ప’ చిత్ర యూనిట్ కు అభినందనలు. సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతం. తెలుగు సినిమా ‘తగ్గేదే లే’ అని నిరూపించారు” అంటూ తెలిపారు.