Vijayendra Prasad : మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి ఫ్రాంచైజ్ లు ఉంటాయి..
తాజాగా విజయేంద్రవర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్-రాజమౌళి సినిమా కథ మీద చర్చలు ఇంకా నడుస్తున్నాయి. స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదు. గ్లోబల్ అడ్వెంచరస్ సినిమా ఇది. సాహసాలు ఉంటాయి. అలాగే ఈ సినిమాకి..............

Vijayendra Prasad comments on Mahesh Rajamouli Movie
Vijayendra Prasad : స్టార్ డైరెక్టర్ రాజమౌళి RRR సినిమాతో భారీ విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిపోయారు జక్కన్న. RRR సినిమాని, రాజమౌళిని హాలీవుడ్ లో తెగ పొగిడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు సాధిస్తుంది ఈ సినిమా. ఇక ఆస్కార్ కి కూడా RRR సినిమా నుంచి నాటు నాటు పాట నిలిచింది.
ఇక RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా కథా చర్చల దశలోనే ఉంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ మహేష్ – రాజమౌళి కథని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచరస్ అని, వేరే దేశాల్లో, అడవుల్లో నిధి వెతికే లాంటి కథతో ఉంటుందని రాజమౌళి పలు సందర్భాలలో చెప్పారు.
తాజాగా విజయేంద్రవర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్-రాజమౌళి సినిమా కథ మీద చర్చలు ఇంకా నడుస్తున్నాయి. స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదు. గ్లోబల్ అడ్వెంచరస్ సినిమా ఇది. సాహసాలు ఉంటాయి. అలాగే ఈ సినిమాకి ఫ్రాంచైజ్ లు కూడా ఉంటాయి అనుకుంటున్నాను. మొదటి సినిమా రిలీజ్ అయ్యాక సీక్వెల్స్ గురించి ఆలోచిస్తాం అని అన్నారు.
Sidharth-Kiara : పెళ్లి పీటలేక్కబోతున్న బాలీవుడ్ స్టార్స్.. ఈ సారైనా పక్కానా?
ఫ్రాంచైజ్ అంటే కథ మారినా అదే క్యారెక్టర్స్ తో హాలీవుడ్ లో మార్వెల్, డీసీ, మిషన్ ఇంపాజిబుల్ లాగా వరుస సినిమాలు వస్తాయి. దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందైతే సినిమా షూట్ మొదలుపెట్టామని కూడా అంటున్నారు. రాజమౌళి సినిమా అంటే చాలా లేట్ గా అవుతుందని తెలిసిందే. దీంతో వీరిద్దరి సినిమా త్వరగా మొదలవ్వాలి అభిమానులు కోరుకుంటున్నారు.