Vijay : విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్.. త్వరలోనే షూటింగ్..

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది.

Vijays Thalapathy 69 with H Vinoth kicks off with an official puja

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు చెన్నైలో జ‌రిగాయి. విజ‌య్ కెరీర్‌లో 69 మూవీగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. త‌న సినీ కెరీర్‌లో విజ‌య్‌కు ఇదే చివ‌రి చిత్రం అని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. పూజా కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌. ప్రేమలు ఫేం మమితా బైజు, ప్రకాశ్‌ రాజ్‌, ప్రియమణి, నరేన్‌, గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, బాబీడియోల్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

Game Changer : ‘గేమ్ ఛేంజ‌ర్’ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చిన త‌మ‌న్‌.. ఈ సారి మెలోడీతో

త్వ‌ర‌లోనే ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే మొదలు కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2025 అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే వెల్ల‌డించింది.

ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీని విజ‌య్ స్థాపించారు. 2026లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని, అంత‌క ముందు జ‌రిగే ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌ద‌ని విజ‌య్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఇక పై సినిమాలు కూడా చేయ‌నని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Swag : ‘స్వాగ్’ మూవీ రివ్యూ.. అయిదు పాత్రలతో శ్రీవిష్ణు నట విశ్వరూపం..