Pradeep Maddali : రామోజీ ఫిలిం సిటీని మేము వాడినంత ఎవరూ వాడి ఉండరు.. వికటకవి డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి..
డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి ఇప్పుడు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ గా వికటకవిని తెరకెక్కించాడు.

Vikatakavi Director Pradeep Maddali Interesting Comments on Series
Pradeep Maddali : నరేష్ అగస్త్య, మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన సిరీస్ ‘వికటకవి’. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. వికటకవి సిరీస్ నవంబర్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో ‘సర్వం శక్తిమయం’ అనే మంచి వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి ఇప్పుడు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ గా వికటకవిని తెరకెక్కించాడు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ నేడు మీడియాతో ముచ్చటించాడు.
ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ గారి దగ్గర రైటర్ గా చేసిన తేజ దేశ్‌రాజ్ రాసుకున్న కథను నాకు చెప్పి డైరెక్ట్ చేస్తావా అని అడగడంతో కథ విని బాగా నచ్చి ఓకే చెప్పాను. నిర్మాతలు ఓ బడ్జెట్ చెప్పి అందులోనే కంప్లీట్ చేయగలవా అని అడిగితే ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్టు మొదలైంది అని తెలిపాడు.
Also Read : Tollywood Actress : చిన్నప్పుడు స్టేజిపై ట్రోఫీ తీసుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఇక ఈ సిరీస్ గురించి చెప్తూ.. వికటకవి సిరీస్ పీరియాడిక్ జానర్ లో సాగుతుంది. కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ కథ 1940, 1970 కాలాల్లో జరుగుతుంది. అప్పటి ప్రపంచం, బట్టలు, అప్పటి ప్రజలు మాట్లాడే భాష, లుక్స్, లైటింగ్ ఇవన్నీ ఒక సెట్ చేయడం ఒక ఛాలెంజింగ్ గా అనిపించింది. స్వాతంత్య్రం రాక ముందు తెలంగాణకు చెందిన అమరగిరి అనే సంస్థానంలో కథ జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ఊరు మునిగిపోతుంది అనే బ్యాక్ డ్రాప్ తో ఓ ఫిక్షనల్ పాయింట్‌ను తీసుకున్నాం. 1940ల్లో అమరగిరి ప్రాంతంలో ఓ ఘటన జరుగుతుంది అదే మళ్ళీ 1970లో జరుగుతుంది. దీంతో అక్కడి ప్రజలు అది అమ్మోరు శాపంగా భావిస్తారు. అది అమ్మోరు శాపమా లేదా ఏదైనా సమస్యా అనేది డిటెక్టీవ్ కనిపెడతాడు ఇలాంటి కథాంశంతో ఆసక్తిగా తెరకెక్కించాము. ఇందులో నరేష్ డిటెక్టివ్ గా, మేఘ ఆకాష్ యువరాణిగా,సైక్రియాటిస్ట్ చదువుకుంటున్న డాక్టర్ పాత్రలో కనిపిస్తారు అని తెలిపారు ప్రదీప్ మద్దాలి.
అయితే ఈ సిరీస్ కు పంజాబీ సినిమాటోగ్రాఫర్ ని తీసుకోవడంపై స్పందిస్తూ.. వికటకవి సిరీస్‌కు షోయబ్ అనే పంజాబీ సినిమాటోగ్రాఫర్ వర్క్ చేశారు. ఇండస్ట్రీలో టాలెంటెడ్ కెమెరామెన్స్ చాలా మంది ఉన్నా పంజాబీ కెమెరామెన్ ఎందుకు అని చాలా మంది అడిగారు. వికటకవిలో డ్రామా వేరుగా ఉంది. అందుకే కొత్త సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుందని షోయబ్‌ను తీసుకున్నాను. ఓ బెంగాలీ సినిమా టెక్చర్ నచ్చి దానికి గ్రాఫర్‌గా చేసిన సంజీవ్ ని ఈ ప్రాజెక్టులోకి తెచ్చాను అని అన్నారు.
ఇక ఈ సిరీస్ లొకేషన్స్ గురించి మాట్లాడుతూ.. ఈ సిరీస్ కోసం ఒక ప్యాలెస్ సెట్ వేసాము. అలాగే ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ.. లాంటి లొకేషన్స్ లోనే షూట్ చేసాము. అవసరమైన చోట మాత్రమే VFX వర్క్స్ వాడాము. ఓ సిరీస్ కోసం రామోజీ ఫిలిం సిటీని మేము వాడినంత ఎవరూ వాడి ఉండరు. సిరీస్ మీరు చూస్తే షూట్ అసలు రామోజీ ఫిలిం సిటీలో చేసినట్టే అనిపించదు అని అన్నారు.
ఇక వికటకవి టైటిల్ గురించి చెప్తూ.. మన తెలుగు సినిమాల్లో వికటకవి అంటే రాయల సంస్థానంలో పని చేసిన తెనాలి రామకృష్ణుడు హస్య చతురత కలిగిన కవి అనే చూపించారు. అయితే తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలుగారి దగ్గర గూఢచారిగా కూడా పని చేశారు. బహమనీ సుల్తానుల నుంచి రాయలవారి రాజ్యాన్ని కాపాడటంలో ఎంతో కీలక పాత్రను పోషించారని అందుకే కథలో హీరోకు అలాంటి షేడ్స్ ఉండటంతో వికటకవి టైటిల్ తీసుకున్నాం. వికటకవి 2 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు.