Thangalaan Teaser : తంగలాన్ టీజర్ రిలీజ్.. వామ్మో విక్రమ్ మరీ ఇంత రా అండ్ రస్టిక్..

తమిళ్(Tamil) స్టార్ హీరో విక్రమ్(Vikram) త్వరలో తంగలాన్(Thangalaan) సినిమాతో రాబోతున్నాడు. పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వంలో విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Thangalaan Teaser : తంగలాన్ టీజర్ రిలీజ్.. వామ్మో విక్రమ్ మరీ ఇంత రా అండ్ రస్టిక్..

Vikram Thangalaan Movie Teaser Released

Updated On : November 1, 2023 / 11:47 AM IST

Thangalaan Teaser : తమిళ్(Tamil) స్టార్ హీరో విక్రమ్(Vikram) త్వరలో తంగలాన్(Thangalaan) సినిమాతో రాబోతున్నాడు. పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వంలో విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ అని, కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారని సమాచారం. గతంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ లుక్, మేకింగ్ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోయారు.

Also Read : Dunki Teaser : షారుఖ్ బర్త్ డే స్పెషల్.. ‘డుంకి’ టీజర్ రిలీజ్?

తాజాగా తంగలాన్ టీజర్ రిలీజ్ చేశారు. బంగారు గనుల దగ్గర ఉండే గ్రామాల్లోని మనుషులు, ఆంగ్లేయులకు మధ్య యుద్ధ సన్నివేశాలు చూపించారు ఈ టీజర్ లో. అలాగే విక్రమ్ ని చాలా భయంకరంగా చూపించారు. కత్తి పట్టుకొని అందర్నీ నరికేస్తూ, ఓ సీన్ లో చేత్తోనే పాముని రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్టు చూపించారు. తంగలాన్ సినిమా రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందని అర్ధమౌతుంది. ఇక ఈ సినిమా జనవరి 26న పాన ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.