Radha Madhavam : ‘రాధా మాధవం’ మూవీ రివ్యూ.. గ్రామీణ ప్రేమకథ..

ఓ గ్రామీణ ప్రేమకథకి కులాలు, పరువు హత్యలు అనే పాయింట్స్ ని జతచేసి రాధా మాధవం సినిమాని చూపించారు.

Radha Madhavam : ‘రాధా మాధవం’ మూవీ రివ్యూ.. గ్రామీణ ప్రేమకథ..

Village Love Story Radha Madhavam Movie Review and Rating

Radha Madhavam : వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా కొత్త దర్శకుడు దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్ వెంకటేష్ నిర్మాణంలో తెరకెక్కిన గ్రామీణ ప్రేమకథ చిత్రం ‘రాధా మాధవం’. ఈ సినిమా నేడు మార్చి 1న థియేటర్స్ లో విడుదలైంది.

కథ విషయానికొస్తే.. రాధా (అపర్ణా దేవీ) మాధవ (వినాయక్ దేశాయ్) పేరు మీద మాధవ కేర్ సెంటర్‌ అని పెట్టి తాగుడుకి బానిసైన వాళ్లని, అనాథ పిల్లల్ని, వృద్దుల్ని చేరదీసి వారిని బాగు చేయడం, వారికి పని కల్పించడం చేస్తుంది. ఈ క్రమంలో జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) అక్కడికి దిక్కు దోచని స్థితిలో వచ్చి తన కూతురు వద్దకి అనాథలా వచ్చానని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకు ఎందుకు వెళ్ళాడు? తండ్రీ కూతుళ్ల మధ్య దూరం ఎందుకు వచ్చింది? రాధ.. మాధవ పేరుతో కేర్ సెంటర్‌ ఎందుకు ప్రారంభించింది? రాధ, మాధవ్ ల ప్రేమ కథ ఏంటి? వారి ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. పరువు హత్యలు, కులాల మధ్య ప్రేమల కాన్సెప్ట్ తో అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. కాకపోతే కథని డైరెక్ట్ గా చెప్పకుండా ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. ఫస్ట్ హాఫ్ చిన్నపిల్లలు, మాధవ కేర్ సెంటర్‌, హీరోయిన్ నాన్న అక్కడికి రావడంతో మొదలయి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. హీరో – హీరోయిన్స్ మధ్య ప్రేమ, వారి ప్రేమకు కులాలు అడ్డు రావడం, హీరోయిన్ తండ్రి పరువు అని వారి ప్రేమని ఏం చేసాడు అనేది సెకండ్ హాఫ్ లో సాగుతుంది.

సినిమాలో ఎక్కువగా కులాల మధ్య చర్చలు, ప్రేమకు కులాలు అడ్డు రావడం, పరువు హత్యలు అనే అంశాన్ని మాట్లాడారు. సెకండ్ హాఫ్ లో కొంత ఎమోషనల్ అవుతారు. ప్రేమ జంటలు – మరో వైపు పగ చూపించే పెద్దలు అన్నట్టు ఫ్లాష్ బ్యాక్ అంతా సాగుతుంది. సినిమాలో హీరో లక్ష్యాన్ని ఓ ట్విస్ట్ లా ఆసక్తిగా చూపించారు.

Also Read : Hanuman : శివరాత్రి రోజు హనుమంతుడి ఆగమనం.. ‘హనుమాన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్..

నటీనటులు.. వినాయక్ దేశాయ్ మాధవ పాత్రలో చదువుకున్న గ్రామీణ యువకుడిగా, తన ప్రేమను, లక్ష్యాన్ని సాధించాలనే కుర్రాడిగా కనిపించి మెప్పించాడు. అపర్ణా దేవీ రాధ పాత్రలో ప్రేమికురాలిగా కనిపించి అలరించింది. మేక రామకృష్ణ హీరోయిన్ తండ్రిగా, ఊరిపెద్దగా, సినిమాలో మెయిన్ విలనీ పాత్రలో కనిపించి అదరగొట్టాడు. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపించాయి.

సాంకేతిక అంశాలు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు పర్వాలేదనిపిస్తాయి. గ్రామీణ ప్రాంతంలో సినిమాని తెరకెక్కించారు. అక్కడి విజువల్స్ ని అందంగా చూపించారు. కథ, కథనం పాతదే అయినా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రూపంలో కథని చెప్పారు. డైలాగ్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే బోరింగ్ గా సాగుతుంది. దర్శకుడిగా దాసరి ఇస్సాకు ఓకే అనిపించాడు. కొత్త నిర్మాతలు అయినా నిర్మాణ విలువలు మాత్రం బాగానే పెట్టారు.

మొత్తంగా ఓ గ్రామీణ ప్రేమకథకి కులాలు, పరువు హత్యలు అనే పాయింట్స్ ని జతచేసి రాధా మాధవం సినిమాని చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.