Vinaro Bhagyamu Vishnu Katha: వినరో భాగ్యము విష్ణు కథ ఆడియో లాంఛ్ ఇక్కడే..!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ మూవీగా నిలుస్తుండటంతో ఈ హీరో నటించే సినిమాలకు సగటు ప్రేక్షకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.

Vinaro Bhagyamu Vishnu Katha Audio Launch To Happen At This Place
Vinaro Bhagyamu Vishnu Katha: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ మూవీగా నిలుస్తుండటంతో ఈ హీరో నటించే సినిమాలకు సగటు ప్రేక్షకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని టీజర్, ట్రైలర్ల వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండటంతో ఈ సినిమా ఆడియో లాంచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర టీమ్ సిద్ధమవుతోంది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహిస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొనడంతో ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్‌పై చిత్ర యూనిట్ తాజాగా ఓ అనౌన్స్‌మెంట్ చేసింది.
వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర ఆడియో లాంచ్‌ను ఫిబ్రవరి 12న సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా కథ సరికొత్త నేపథ్యంలో వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరో లెవెల్‌కు చేరుకుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన అందాల భామ కశ్మీరా పరదేశి హీరోయిన్‌గా నటిస్తోండగా, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు.
#VinaroBhagyamuVishnuKatha Audio Launch Event on Feb 12th @ Tirupathi ❤️#VBVKTrailer – https://t.co/PL87EfErOm #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @daniel_viswas @adityamusic #NumberNeighbour ? – #VBVKonFEB17th pic.twitter.com/mcTMBJyaSe
— Geetha Arts (@GeethaArts) February 10, 2023