Vinaro Bhagyamu Vishnu Katha: గుడి ముందు బసవన్నతో కిరణ్ పర్ఫెక్ట్ మాస్ లుక్!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా.. వరుస విజయాలతో తనకంటూ..

Vinaro Bhagyamu Vishnu Katha
Vinaro Bhagyamu Vishnu Katha: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా.. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హ్యాపెనింగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురిళి కిషోర్ గతంలో పని చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో జరుగుతుంది.
VinaroBhagyamuVishnuKatha: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్!
35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి కానుంది. ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నాయి. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్ లో అందరిని అలరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Kiran Abbavaram: కొత్త హీరో.. వరసగా ఐదు సినిమాల హీరో!
పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, చావు కబురు చల్లగా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి అద్భుతమైన విజయాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ✨#AlluAravind #BunnyVas @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @ItsChavan @GA2Official #VBVKMovie pic.twitter.com/Wm1jVYOV0m
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) April 10, 2022