EeSaraina : ‘ఈ సారైనా’ ట్రైలర్ రిలీజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా 'ఈ సారైనా' సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Viplav EeSaraina Movie Trailer Released and Pre Release Event Happened
EeSaraina : విప్లవ్ దర్శకత్వం వహిస్తూ మెయిన్ లీడ్ లో నటిస్తున్న సినిమా ‘ఈ సారైనా’. అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ రిలీజవ్వగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సారైనా సినిమా గ్రామీణ నేపధ్యంలో ఉండనుంది. ఒక నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ అతని ప్రేమను దక్కించుకున్నాడా అనే పాయింట్ లో సాగనుంది ఈ సినిమా.
ఈ సినిమా నవంబర్ 8న రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విప్లవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా మీ అందరి ముందుకు రావడానికి కారణం సంకీర్త్ అన్న. ఈ సినిమాకి నేనే నిర్మాతని. అన్నిటినీ కష్టమైనా మేనేజ్ చేశాను. టీజర్, సాంగ్స్ అన్నీ నచ్చితే సినిమా చూడండి అని అన్నారు. హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ.. శిరీష క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు విప్లవ్ కి థ్యాంక్స్. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ హాలిడేస్ లాగా అనిపించింది. నా ఫస్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్ రావడం సంతోషంగా ఉంది అని తెలిపింది.
చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ.. సలార్ తర్వాత నాకు ఈ క్యారెక్టర్ చెప్పగానే నచ్చేసింది. ఈ రోజు ప్రివ్యూలో చూసాక సినిమాలో అన్ని సీన్స్ చాలా ప్లెజంట్ గా అనిపించాయి అని అన్నారు. కో ప్రొడ్యూసర్ సంకీర్త్ మాట్లాడుతూ.. నా దృష్టి లో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. నా దృష్టిలో ఒక సినిమా మనతో పాటు ఇంటికి వచ్చిందంటే అది అందరికీ నచుతుంది. ఈ సినిమాలో కూడా అందరూ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు అని తెలిపారు.