Virupaksha: 4 రోజులు.. 50 కోట్లు.. విరూపాక్ష విశ్వరూపం!
విరూపాక్ష మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

Virupaksha Collects 50 Crores In 4 Days
Virupaksha: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ‘విరూపాక్ష’ మూవీ రోజురోజుకు తన సత్తా చాటుతూ వెళ్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను పూర్తిగా మిస్టిక్ థ్రిల్లర్ కథాంశంతో చిత్ర యూనిట్ రూపొందించిన తీరు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసింది. హార్రర్ ఎలిమెంట్స్ వారిని భయపడేలా చేయడంలో సక్సెస్ అయ్యాయి.
Virupaksha: యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తగ్గేదే లే అంటోన్న ‘విరూపాక్ష’
ఫలితంగా విరూపాక్ష మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో, ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. చాలా రోజుల తరువాత తెలుగులో ఇలాంటి థ్రిల్లర్ మూవీ వచ్చిందంటూ ‘విరూపాక్ష’ను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
Virupaksha: మూడు రోజుల్లో అదరగొట్టిన విరూపాక్ష.. హాఫ్ సెంచరీకి చేరువలో తేజు మూవీ!
యాక్సిడెంట్ తరువాత తేజు నటించిన సినిమా కావడంతో, ఆయన ఈ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మున్ముందు ఎలాంటి వసూళ్లు రాబడుతుందా అని చిత్ర వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది.