Makutam Song : విశాల్ – అంజలి మాస్ సాంగ్ చూశారా..? మకుటం సినిమా నుంచి..
మీరు కూడా విశాల్ - అంజలి మాస్ సాంగ్ వినేయండి.. (Makutam Song)
Makutam Song
Makutam Song : విశాల్, అంజలి జంటగా మకుటం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విశాల్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాతో విశాల్ దర్శకుడిగా కూడా మారారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్వర్గీయ ఆర్ బీ చౌదరి సమర్పణలో జితన్ రమేష్ నిర్మాణంలో ఆ సంస్థ 99వ సినిమాగా మకుటం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ‘నచ్చాకే వచ్చేరా’ అనే మాస్ పాటని విడుదల చేసారు. ఈ సాంగ్ ని తెలుగులో ఫోక్ సింగర్ ప్రభ బంగారిగళ్ళ పాడారు.
మీరు కూడా విశాల్ – అంజలి మాస్ సాంగ్ వినేయండి..
Also Read : Bellamkonda Sreenivas : సరికొత్త రికార్డ్ సాధించిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇండియాలో ఒకే ఒక్క హీరో..
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో విశాల్ మాట్లాడుతూ .. ఈ సారి దర్శకుడిగా కూడా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాను. ఆర్జీవీ శివ సినిమా చూసాకే దర్శకుడిగా చేయాలనీ ఆలోచన వచ్చింది. ఆర్బీ చౌదరి గారిని మిస్ అవుతున్నాను. ఆయన 99వ సినిమా బాధ్యతల్ని నాకు ఇచ్చారు. ఈ మూవీ కోసమే ఏడాదిపాటు నా పర్సనల్ లైఫ్ కూడా పాకాన పెట్టాను. తెలుగు ఫోక్ సింగర్ ప్రభ ఈ పాటను అద్భుతంగా పాడింది. మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఇక్కడ ఉన్నాను. పందెంకోడి సినిమాని ఆయనే పట్టుబట్టి తెలుగులో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు అని తెలిపారు.

అంజలి మాట్లాడుతూ.. మదగదరాజా తరువాత విశాల్‌తో కలిసి మకుటం చేస్తున్నాను. ఈ సినిమాలో నేను ఓ మంచి పవర్ ఫుల్ రోల్‌ను పోషించాను. విశాల్‌తో నాకు 15 ఏళ్ల బంధం ఉంది. ఆయన నాకు స్పెషల్ ఫ్రెండ్ అని తెలిపింది. నిర్మాత జితన్ రమేష్ మాట్లాడుతూ.. విశాల్ మా ఇంట్లో వ్యక్తిలా, సొంత అన్నలా ఉంటాడు. అన్నీ తానై విశాల్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. మా సంస్థ నుంచి 99వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది. వందో ప్రాజెక్ట్ అనేది మా నాన్న గారికి ఎంతో స్పెషల్. ఆయన కోరికను మేం నెరవేర్చుతాం. వంద కాదు రెండొందల ప్రాజెక్టులు చేసి ఆయన లెగసీని కంటిన్యూ చేస్తామని తెలిపారు.
