Vishal Laththi movie teaser date fix
Vishal: తమిళ స్టార్ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో తన ప్రతి సినిమాని కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విడుదల చేస్తుంటాడు. ప్రస్తుతం ఈ హీరో తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “లాఠీ”. విశాల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాకు వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునైనా హీరోయిన్ గా నటిస్తుంది.
Hero Vishal : అర్ధరాత్రి విశాల్ ఇంటిపై దాడి.. విశాల్ ఇంట్లో లేని సమయంలో.. అద్దాలు పగలగొట్టి..
విశాల్ మూవీస్ అంటే ప్రేక్షకులు ఎక్కువుగా ఆశించేది యాక్షన్ సీన్స్.. ఇది క్యాష్ చేసుకునే విశాల్ చివరి మూవీ ‘సామాన్యుడు’ విడుదల సమయంలో 10 నిమిషాల ఫైట్ సీన్ ని విడుదలకు ముందే విడుదల చేశారు. తాజాగా లాఠీ సినిమాలో దాదాపు సెకండ్ హాఫ్ లోని 45 నిమిషాలు పాటు యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నట్లు చెబుతున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ టీజర్ రిలీజ్ కి చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసింది.
ఈ నెల 13 ఆదివారం నాడు మూవీ టీజర్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాలోని విశాల్ యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలైట్ కానున్నాయి అని చెబుతున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తాము అని తెలియజేశారు దర్శకనిర్మాతలు. కాగా విశాల్ తన సూపర్ హిట్ మూవీ ‘డిటెక్టివ్’కి సీక్వెల్ తెరకెక్కించేందుకు రూట్ క్లియర్ చేస్తున్నాడు.