Hero Vishal : అర్ధరాత్రి విశాల్ ఇంటిపై దాడి.. విశాల్ ఇంట్లో లేని సమయంలో.. అద్దాలు పగలగొట్టి..

తమిళ్ స్టార్ హీరో విశాల్‌ ఇంటిపై అర్ధరాత్రి సమయంలో దుండగులు రాళ్లతో దాడి చేశారు. చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి విశాల్‌ నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం........

Hero Vishal : అర్ధరాత్రి విశాల్ ఇంటిపై దాడి.. విశాల్ ఇంట్లో లేని సమయంలో.. అద్దాలు పగలగొట్టి..

unknown persons attacked on vishal house at night time

Hero Vishal :  తమిళ్ స్టార్ హీరో విశాల్‌ ఇంటిపై అర్ధరాత్రి సమయంలో దుండగులు రాళ్లతో దాడి చేశారు. చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి విశాల్‌ నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం విశాల్ అవుట్ డోర్ లో ఉన్నాడు. విశాల్ ఇంట్లో లేని సమయంలో అర్ధరాత్రి పూట కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఎరుపు రంగు కారులో వచ్చి విశాల్‌ ఇంటిపై రాళ్లతో దాడి చేసి అనంతరం కారులో పరారయ్యారు.

Saniya Iyyappan : మీద చెయ్యి వేసినందుకు అభిమానిని కొట్టిన హీరోయిన్..

ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు అక్కడ సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో విశాల్‌ ఇంటి అద్దాలు కొన్ని ధ్వంసం అయ్యాయి. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడిపై విశాల్‌ మేనేజర్‌ అన్నానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడి ఎవరు చేసి ఉంటారు, విశాల్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై విశాల్ మాత్రం ఇంకా స్పందించలేదు.