Vishal Health : విశాల్ కి ఏమైంది.. బక్కగా అయిపోయి.. వణుకుతూ.. క్లారిటీ ఇచ్చిన డాక్టర్లు..

విశాల్ ఇలా బక్కగా అయిపోయి, వణుకుతూ మాట్లాడుతుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసారు.

Vishal Video goes Viral Doctors gives update on Vishal Health

Vishal Health : తమిళ్ స్టార్ హీరో విశాల్ తెలుగువాడైన తమిళ్ లో వరుస సినిమాలతో హీరోగా ఎదిగాడు. ఇక్కడ తెలుగులో కూడా తన డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి అభిమానులను సంపాదించుకున్నాడు. విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీతో హిట్ కొట్టాడు. చివరగా రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది.

Also Read : Pushpa 2 Collections : హమ్మయ్య.. ఎట్టకేలకు బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన పుష్ప 2.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

విశాల్ హీరోగా నటించిన మదగజరాజా సినిమా 2013 నుంచి వాయిదా పడుతూ ఇప్పుడు 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే ఎప్పుడూ ఫిట్ గా ఉండే విశాల్ తాజాగా ఓ ఈవెంట్లో బక్కగా అయిపోయి వణుకుతూ మాట్లాడాడు. నిన్న విశాల్ ఓ ఈవెంట్లో పాల్గొనగా మాట్లాడుతుంటే అతని చెయ్యి వణుకుతూనే ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

విశాల్ ఇలా బక్కగా అయిపోయి, వణుకుతూ మాట్లాడుతుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసారు. గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ కి ఫైట్ సీక్వెన్స్ చేసేటప్పుడు అయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలోనే కంటికి కూడా పెద్ద దెబ్బ తగిలింది. అప్పట్లో విశాల్ కి నరాల సమస్య కూడా వచ్చిందని, ఇప్పుడు మళ్ళీ అది తిరగబడింది పలువురు అంటున్నారు. దీంతో విశాల్ కి ఏమైంది అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో విశాల్ టీమ్ స్పందించి విశాల్ డాక్టర్ తో అధికారిక ప్రకటన ఇప్పించారు. డాక్టర్ రిలీజ్ చేసిన అప్డేట్ ప్రకారం.. ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అతను ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే అతనికి పూర్తిగా బెడ్ రెస్ట్ కావాలి ఈ సమయంలో అని తెలిపారు. దీంతో విశాల్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, నెటిజన్లు కోరుకుంటున్నారు.

Also Read : Game Changer : తమిళనాడు, కర్ణాటకలో గేమ్ ఛేంజర్ కి షాక్.. రిలీజ్ దగ్గర పడుతుంటే ఈ ఇబ్బందులు ఏంటి?

అయితే కేవలం వైరల్ ఫీవరేనా, ఎందుకు అంత బక్కగా అయిపోయాడు అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా విశాల్ ప్రస్తుతం అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. విశాల్ చేతిలో ప్రస్తుతం డిటెక్టివ్ సీక్వెల్ సినిమా మాత్రమే ఉంది. మదగజరాజా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.