×
Ad

Vishnupriya : మూడేళ్ళ వయసులో అమ్మనాన్న విడిపోయారు.. నాన్నతో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు.. అమ్మ చనిపోయాక..

విష్ణుప్రియ తల్లి రెండేళ్ల క్రితం మరణించిందని, తన తండ్రికి దూరంగా ఉండేది అని గతంలో బిగ్ బాస్ లో, పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.(Vishnupriya)

Vishnupriya

Vishnupriya : విష్ణుప్రియ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొని నటిగా బిజీ అయింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్స్ చేస్తూనే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో విష్ణుప్రియ బిగ్ బాస్ కి కూడా వెళ్ళింది. యాంకర్ విష్ణుప్రియ తల్లి రెండేళ్ల క్రితం మరణించిందని, తన తండ్రికి దూరంగా ఉండేది అని గతంలో బిగ్ బాస్ లో, పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.(Vishnupriya)

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ ఎక్కువగా తల్లి గురించే మాట్లాడుతుంది, ఆమెతో ఉన్న ఫోటోలు షేర్ చేస్తుంది. నాన్న గురించి మాట్లాడదు ఎందుకు అని అడిగారు.

Also Read : Devisri Prasad : పవన్ గారు మళ్ళీ డ్యాన్స్ చేయాలనిపించింది అన్నారు.. ఉస్తాద్ భగత్ సింగ్ పై దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్..

దీనికి విష్ణుప్రియ సమాధానమిస్తూ.. నాకు మూడేళ్లు ఉన్నప్పుడే అమ్మ నాన్న విడిపోయారు. మా అమ్మకు ఇష్టం లేదు మేము నాన్నతో, నాన్న సైడ్ రిలేటివ్స్ తో మాట్లాడటం. కానీ మేము అప్పుడప్పుడు హాలిడేస్ కి నానమ్మ వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. నాకు మా నాన్న మీద ప్రేమ ఉన్నా మా అమ్మకు ఇష్టం లేదని మాట్లాడేదాన్ని కాదు. మా చెల్లి మాట్లాడేది. మా అమ్మ చనిపోయాక నాన్నతో మాట్లాడుతున్నా.

నా లైఫ్ లో చిన్నప్పుడు చూసిన పెద్ద పెయిన్ మా పేరెంట్స్ విడిపోవడం. నేను తట్టుకోలేకపోయాను. మా అమ్మ నాన్నను కలపాలని దేవుడికి దండం పెట్టుకునేదాన్ని. నా చిన్నప్పుడు అప్పుడప్పుడు ఫెస్టివల్స్ కి వచ్చేవాడు కానీ అమ్మతో గొడవ అయ్యేది దాంతో రావడం మానేసాడు. ఆయన మాకేం చెడు చేయలేదు. అందుకే నేను మాట్లాడతాను అని తెలిపింది.

Also Read : Vishnupriya : మొన్న ఉదయభాను, సౌమ్య.. ఇవాళ విష్ణుప్రియ.. వాళ్లకు నా మీద కుళ్ళు.. టాలీవుడ్ యాంకర్స్ మధ్య ఏం జరుగుతుంది?