Vishwak Sen : విశ్వక్ సేన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఒకే ఒక్క సినిమా.. ఏంటో తెలుసా?

అందరూ విశ్వక్ సేన్ మొదటి సినిమా 'వెళ్ళిపోమాకే' అని అనుకుంటారు. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేసినట్టు ఇంటర్వ్యూలో చెప్పి విశ్వక్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Vishwak Sen : ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో మెప్పిస్తున్నాడు. త్వరలోనే ‘గామి’ సినిమాతో రాబోతున్నాడు. యువ హీరోలలో మాస్ హీరోగా కమర్షియల్ సినిమాలు తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా విశ్వక్ సేన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలని తెలిపాడు.

అందరూ విశ్వక్ సేన్ మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే’ అని అనుకుంటారు. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేసినట్టు ఇంటర్వ్యూలో చెప్పి విశ్వక్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల పిచ్చి ఉంది. 9, 10 తరగతులు చదివేటప్పటి నుంచే ఆడిషన్స్ ఇచ్చాను. జోష్ సినిమాకి హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ కి ఆడిషన్ కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను. మరీ చిన్నపిల్లాడిలా ఉన్నాను అని దాసరి నారాయణరావు నిర్మాతగా ఒక సినిమా తీస్తుంటే దానికి చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే నా ఫొటోలు పంపించారు. అలా దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) నిర్మాణంలో జగపతిబాబు హీరోగా చేసిన బంగారు బాబు(Bangaru Babu) సినిమాకి సెలెక్ట్ అయ్యాను.

అప్పుడు దిల్‌షుఖ్ నగర్ లో ఉండేవాళ్ళం. ఫస్ట్ టైం ఇంటికి వ్యాన్ వచ్చి ఎక్కించుకొని రామోజీ ఫిలింసిటీకి తీసుకెళ్లింది. అదే నేను ఫస్ట్ టైం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లడం, అదే నాకు ఫస్ట్ సినిమా సెట్ ఎక్స్‌పీరియన్స్, అదే నాకు ఫస్ట్ రెమ్యునరేషన్. ఒక్కరోజులో అయిపొయింది నా పాత్ర షూటింగ్. హీరో చిన్నప్పుడు అతన్ని చెడగొట్టే బ్యాచ్ లో నేనొకడ్ని. ఒక రెండు షాట్స్ లో కనిపిస్తాను సినిమాలో. దానికి 900 రెమ్యునరేషన్ ఇచ్చారు ఆ రోజు.. అని అప్పటి సంగతులని గుర్తుచేసుకున్నాడు విశ్వక్.

Also Read : Allu Arjun : ఇంటర్నేషనల్ వేదికపై అల్లు అర్జున్ కి సన్మానం.. ‘పుష్ప’ తగ్గేదేలే..

ఆ తర్వాత కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా ప్రయత్నించినా అవకాశాలు రాలేదని తెలిపాడు. ఆ ఒక్క సినిమా తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా హీరోగా వెళ్ళిపోమాకే సినిమా చేసినట్లు తెలిపాడు విశ్వక్ సేన్. దీంతో విశ్వక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడా అని అతని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు