Allu Arjun : ఇంటర్నేషనల్ వేదికపై అల్లు అర్జున్ కి సన్మానం.. ‘పుష్ప’ తగ్గేదేలే..

అల్లు అర్జున్ ఇండియన్ సినిమా తరపున బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వెళ్ళాడు.

Allu Arjun : ఇంటర్నేషనల్ వేదికపై అల్లు అర్జున్ కి సన్మానం.. ‘పుష్ప’ తగ్గేదేలే..

Allu Arjun Felicitated in Berlin International Film Festival

Updated On : February 17, 2024 / 10:28 AM IST

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకొని మొదటి తెలుగు నటుడిగా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. పుష్ప సాంగ్స్, డైలాగ్స్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా పాపులర్ అయ్యాయి. తాజాగా అల్లు అర్జున్ ఇండియన్ సినిమా తరపున బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వెళ్ళాడు.

బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్(Berlin International Film Festival) లో పుష్ప సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేసినట్టు సమాచారం. అనంతరం అల్లు అర్జున్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడాడు. అక్కడి ఫిలిం ఫెస్టివల్ ప్రతినిధులు అల్లు అర్జున్ కి సన్మానం చేశారు. బన్నీకి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ తరపున ఓ చిరు కానుక అందచేసి సన్మానం నిర్వహించారు. అల్లు అర్జున్ అధికారికంగా ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేస్తుండటంతో కేంద్రంకు చెందిన నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ఫోటోలు అధికారికంగా పోస్ట్ చేస్తుంది.

Also Read : Balakrishna : బాలయ్యకి హ్యాట్రిక్ ఇచ్చిన ముగ్గురు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో.. అదిరింది అంటున్న అభిమానులు..

అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ వేదికపై మాట్లాడటం, సన్మానం అందుకోవడం, పుష్ప సినిమాని స్క్రీన్ చేయడంతో అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.