Vishwak Sen: మాస్ కా దాస్ కోసం అప్పుడు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్..?

టాలీవుడ్‌లో మాస్ కా దాస్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్, క్రేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ హీరో నటించే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో, తన నెక్ట్స్ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు విశ్వక్ సేన్. స్వీయ డైరెక్షన్‌లో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ మూవీపై అంచనాలను క్రియేట్ అయ్యేలా చేశాయి.

Vishwak Sen: మాస్ కా దాస్ కోసం అప్పుడు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్..?

Vishwak Sen Dhamki Pre-Release Event To Be Graced By Jr NTR

Updated On : February 27, 2023 / 3:40 PM IST

Vishwak Sen: టాలీవుడ్‌లో మాస్ కా దాస్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్, క్రేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ హీరో నటించే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో, తన నెక్ట్స్ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు విశ్వక్ సేన్. స్వీయ డైరెక్షన్‌లో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ మూవీపై అంచనాలను క్రియేట్ అయ్యేలా చేశాయి.

Vishwak Sen: విశ్వక్ సేన్ ధమ్కీ వచ్చేది ఇక అప్పుడేనా..?

ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు విశ్వక్ సేన్ తనదైన మార్క్ ప్రమోషన్స్‌ను చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ధమ్కీ చిత్ర ట్రైలర్ లాంచ్‌ను నందమూరి బాలకృష్ణ లాంచ్ చేయగా, ఈ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత బజ్‌ను క్రియేట్ చేసేందుకు మరో స్టార్ హీరో సాయం తీసుకునేందుకు విశ్వక్ సేన్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Virupaksha: విరూపాక్ష కోసం వస్తున్న వీరమల్లు.. ఫ్యాన్స్‌కు పండగే!

ధమ్కీ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 18న నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఈ క్రమంలో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తీసుకొచ్చేందుకు విశ్వక్ సేన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బాబాయ్‌తో సినిమా ప్రమోషన్స్ చేసిన విశ్వక్ సేన్, ఇప్పుడు అబ్బాయ్ సాయం తీసుకుంటడటంతో ఈ సినిమాకు మరింత హైప్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 22న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి విశ్వక్ సేన్ ధమ్కీ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు తారక్ నిజంగానే వస్తాడా లేడా అనేది చూడాలి.