Vishwak Sen : ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ సినిమా సెట్స్‌లో విశ్వక్ సేన్‌కి ప్రమాదం..

'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమా సెట్స్‌లో విశ్వక్ సేన్ ప్రమాదానికి గురయ్యినట్లు సమాచారం. మూవీలోని ఒక యాక్షన్ సన్నివేశం తెరకెక్కిస్తున్న సమయంలో..

Vishwak Sen injured in the sets of gangs of godavari movie

Vishwak Sen : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ అనే కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీ గోదావరి ప్రాంతంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కుతుంది. అంజలి, నేహశెట్టి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్ లో విశ్వక్ సేన్ ప్రమాదానికి గురయ్యినట్లు సమాచారం.

మూవీలోని ఒక యాక్షన్ సన్నివేశం తెరకెక్కిస్తున్న సమయంలో విశ్వక్ ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఫైట్ సీక్వెన్స్ లో భాగంగా లారీ మీద ఉన్న విశ్వక్ కిందకి దూకుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో విశ్వక్ ఎమైనా గాయాలు జరిగాయా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Chiranjeevi : చిరంజీవి సినిమా డైరెక్ట్ చేయను అంటున్న డైరెక్టర్.. ఎందుకో తెలుసా..?

కాగా ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ మూవీని డిసెంబర్ 8న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. కానీ ఈ చిత్రం ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఆ మధ్య ఈ సినిమా పోస్టుపోన్ అవ్వబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. విశ్వక్ సేన్ కూడా ఈ వాయిదా గురించి ఇన్‌డైరెక్ట్‌ గా మాట్లాడుతూ ఒక పోస్టు కూడా వేశారు.

“ఆవేశానికో, ఈగోకో తీసుకున్న డెసిషన్ కాదు ఇది. తగ్గేకొద్దీ మింగుతారని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు. మహాకాళి నాతో ఉంది. డిసెంబర్ లో సినిమా రిలీజవ్వకపోతే నేను ఇక ప్రమోషన్స్ లో కనబడును” అంటూ పోస్ట్ వైరల్ పోస్ట్ చేశారు. ఈ విషయం పై నిర్మాత నాగవంశీని ప్రశ్నించగా.. “విశ్వక్ ఎందుకు అలా పోస్టు చేసాడో అతనే అడగాలి” అంటూ బదులిచ్చారు. మరి ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.