Chiranjeevi : చిరంజీవి సినిమా డైరెక్ట్ చేయను అంటున్న డైరెక్టర్.. ఎందుకో తెలుసా..?
చిరంజీవితో సినిమా చేయను అంటున్న డైరెక్టర్. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు..? ఎందుకు అలా అన్నారు..?

Tollywood Director says he didnt want to direct Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని చాలామంది దర్శకులు ఎదురు చూస్తుంటారు. ఆ ఛాన్స్ ఎప్పు వస్తుందా అనే కలలు కంటుంటారు. కానీ ఒక డైరెక్టర్ మాత్రం చిరంజీవితో సినిమా చేయను అంటున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు..? ఎందుకు అలా అన్నారు..?
సత్యం రాజేష్ మెయిన్ లీడ్ తెరకెక్కిన ‘పొలిమేర-2’ ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుని అందుకుంది. అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. నవంబర్ 3న రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈ మూవీ సక్సెస్ లో భాగంగా దర్శకుడు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి పై కామెంట్స్ చేశారు.
అనిల్ విశ్వనాథ్ కామెంట్స్..
“నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన్ని కలిసే అవకాశం వచ్చినా కలవలేదు. ఎందుకంటే ఆయన్ని కలిసిన ఆనందంలో ఎక్కడ ఏడ్చేస్తానో అని భయం. నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను పలకరించవచ్చు. అలాకాకుండా ఆయన నా సినిమా చూసి నా అభిమాని మంచి సినిమా చేశాడని అనుకోవాలి అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. పొలిమేర-2 విషయంలో అది కుదరలేదు. కానీ నెక్స్ట్ సినిమాకి ప్రయత్నిస్తా.
ఒకవేళ ఆయన నా సినిమా చూసి ‘చాలా బాగా తీశావు’ అని అంటే అక్కడి నుంచి నేను సినిమాలు తీయడం మానేస్తానేమో. ఎందుకంటే ఆయన ప్రశంసలకు మించిన పురస్కారాలు ఇంకేమి ఉండవు. ఇక దర్శకుడిగా ఆయనతో సినిమా అంటే చాలా కష్టం. నేను చేయలేను. ఎందుకంటే డైరెక్టర్ అనే వాడు హీరోకి ఎలా చేయాలి అని చెప్పాలి. కానీ నాకు ఆయన ఏం చేసిన నచ్చుతుంది. ఆయనను నేను జడ్జ్ చేయలేను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.